E-Paper
Advertisement

ఈ హెల్మెట్లు పెట్టుకుంటే.. జుట్టు రాలే సమస్యలే ఉండవట, వెంటనే కొనేయండి!

ఈ హెల్మెట్లు పెట్టుకుంటే.. జుట్టు రాలే సమస్యలే ఉండవట, వెంటనే కొనేయండి!
Advertisement

Helmet and Hair Loss: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందనే అపోహ చాలామందిలో ఉంది. కానీ, నిజానికి హెల్మెట్ వల్ల నేరుగా జుట్టు రాలదు. అయితే, సరైన పద్దతిలో వాడకపోతే చెమట, దుమ్ము, బ్యాక్టీరియా, హెల్మెట్ లోపలికి చేరి.. రాపిడి కారణంగా వెంట్రుకలు బలహీనపడి రాలే అవకాశం ఉంటుంది. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సరైన హెల్మెట్‌ను ఎంచుకోవాలి!

హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో ముందుగా లోపలి ప్యాడింగ్ తీసి ఉతికే అవకాశం ఉందో? లేదో? చూసుకోవాలి. రిమూవబుల్, వాషబుల్ లైనింగ్ ఉన్న హెల్మెట్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఈజీ. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్ ఉన్న మోడళ్లు చెమట వల్ల వచ్చే దుర్వాసన, బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

Advertisement

గాలి సరిగా ఆడేలా ఎక్కువ వెంటిలేషన్ ఉన్న హెల్మెట్ ఎంచుకోవడం చాలా మంచిది. తలలో వేడి, చెమట తగ్గుతాయి. మరీ బరువైన హెల్మెట్ కాకుండా తక్కువ బరువుతో పాటు ISI, DOT సర్టిఫికేషన్ ఉన్న క్వాలిటీ  హెల్మెట్‌ను ఉపయోగించడం మంచిది.

హెల్మెట్ మరీ టైట్‌గా ఉండకూడదు. అలాగే చాలా లూజ్‌గా కూడా ఉండకూడదు. తలకు సరిగ్గా సరిపోయే సైజ్‌ను సెలెక్ట్ చేసుకుంటే జుట్టుపై అనవసర ఒత్తిడి పడదు.

హెల్మెట్ వాడేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

Advertisement

హెల్మెట్ పెట్టుకునే ముందు కాటన్ హెల్మెట్ క్యాప్ ధరించడం మంచిది. ఇది చెమటను పీల్చుకుని జుట్టు, హెల్మెట్ మధ్య ఘర్షణను తగ్గిస్తుంది. రోజూ బైక్ నడిపేవాళ్లు మూడు, నాలుగు కాటన్ క్యాప్స్ కొనుగోలు చేసి, ప్రతిరోజూ ఉతికిన క్యాప్‌ను వాడితే మరింత పరిశుభ్రంగా ఉంటుంది.

తడి జుట్టుతో హెల్మెట్ పెట్టుకోవడం మానుకోవాలి. స్నానం చేసిన వెంటనే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే హెల్మెట్ ధరించాలి. లేదంటే తలలో ఫంగస్, డాండ్రఫ్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

హెల్మెట్ పెట్టేటప్పుడు జుట్టును మెల్లగా వెనక్కి సర్దుకుంటూ ధరించాలి. మరీ గట్టిగా లాగడం వల్ల వెంట్రుకలు బలహీనపడే అవకాశం ఉంటుంది.

హెల్మెట్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి!

ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి హెల్మెట్ లోపలి ప్యాడింగ్‌ను తీసి మైల్డ్ షాంపూతో ఉతికి బాగా ఆరబెట్టాలి. డ్రైవింగ్ పూర్తయిన తర్వాత హెల్మెట్‌ ను వెంటనే మూసివేయకుండా కొద్దిసేపు గాలి తగిలేలా ఉంచితే లోపలి తేమ, దుర్వాసన తగ్గుతాయి.

వేరే వ్యక్తులు ఉపయోగించిన హెల్మెట్‌ను వీలైనంత వరకు వాడకపోవడం మంచిది. ఎందుకంటే డాండ్రఫ్,  ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ ప్యాడింగ్‌ను తరచూ ఉతకడం కుదరకపోతే యాంటీ బ్యాక్టీరియల్ హెల్మెట్ క్లీనర్ స్ప్రేలను యూజ్ చేయాలి.

మార్కెట్లో కొత్త టెక్నాలజీ హెల్మెట్లు

ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు యాంటీ బ్యాక్టీరియల్ లైనింగ్, మంచి ఎయిర్ వెంటిలేషన్‌తో కూడిన హెల్మెట్లను అందిస్తున్నాయి. అంతేకాదు, హెల్మెట్ లోపల చల్లని గాలి అందించే చిన్న ఫ్యాన్, కూలింగ్ సిస్టమ్ ఉన్న మోడళ్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ఎక్కువసేపు ప్రయాణించే వారికి మంచి సౌకర్యాన్ని అందిస్తాయి.

సో, జుట్టు రాలిపోవడానికి హెల్మెట్ ఒక్కటే కారణం కాదు. సరైన సైజ్ హెల్మెట్ సెలెక్ట్ చేసుకోవడం, పరిశుభ్రంగా ఉంచడం, కాటన్ హెల్మెట్ క్యాప్ ఉపయోగించడం, తడి జుట్టుతో హెల్మెట్ ధరించకపోవడం లాంటి చిన్న పద్దతులు పాటిస్తే జుట్టు హెల్తీగా ఉంటుంది.

Read Also: వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

Tags

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×