E-Paper
Advertisement

AI Bluetooth Smart Helmet: హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్ హెల్మెట్, వామ్మో ఇన్ని ఫీచర్లా?

AI Bluetooth Smart Helmet: హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్ హెల్మెట్, వామ్మో ఇన్ని ఫీచర్లా?
Advertisement

ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ హెడ్‌ఫాక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. తాజాగా అత్యాధునిక ఫీచర్లతో కూడిన N2F Wolf AI బ్లూటూత్ స్మార్ట్ హెల్మెట్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హెల్మెట్ బోలెడు ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్, GPS నావిగేషన్, కాల్స్, మ్యూజిక్, LED బ్లింకర్ లాంటి ఫీచర్లతో డిజైన్ చేయబడింది. ISI సర్టిఫైడ్తో పాటు రైడర్లకు సేఫ్టీ, కన్వీనియెన్స్ అదే సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించేలా తయారు చేయబడింది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్స్  

ఈ హెల్మెట్ ఫుల్ ఫేస్ డిజైన్‌తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. 5.2 తో సీమ్‌ లెస్ కనెక్టివిటీతో ఉంటుంది. హ్యాండ్స్ ఫ్రీ కాల్స్, మ్యూజిక్ ప్లే ఆప్షన్ ను కలిగి ఉంటుంది. మంచి సౌండ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. 40mm ప్రీమియం స్టీరియో స్పీకర్లు, Boom MICతో అడ్వాన్స్‌ డ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో  క్లియర్ కాల్స్,  మ్యూజిక్ ను అందిస్తుంది. ఇది మల్టీ ఫంక్షనల్ బటన్లను కలిగి ఉంటుంది. కాల్స్, వాల్యూమ్, ట్రాక్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 48 గంటల టాక్ టైమ్, 110 గంటల స్టాండ్‌బైని కలిగి ఉంటుంది.  Type-C ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది. LED బ్లింకర్ లైట్స్, GPS సపోర్ట్ ఫర్ నావిగేషన్ ను కలిగి ఉంటుంది. సాఫ్ట్ ఇంటీరియర్ ప్యాడింగ్, డిటాచబుల్, వాషబుల్ అవకాశం ఉంటుంది. లైట్‌వెయిట్, డ్యూరబుల్ షెల్, సెక్యూర్ లాకింగ్ సిస్టమ్ తో వస్తుంది. డే అండ్ నైట్ రైడ్స్‌ కు సూటబుల్ గా ఉంటుంది. నాలుగు రంగుల్లో ఉంటుంది.

Advertisement

ఈ హెల్మెట్ AI-బేస్డ్ వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. ఇది హ్యాండ్స్ ఫ్రీ కన్వీనియెన్స్ అందిస్తుంది. సింపుల్ వాయిస్ కమాండ్స్ ను కలిగి ఉంటుంది. Google Assistant, Siri, Bixby లాంటి AI అసిస్టెంట్లను కలిగి ఉంటుంది. యాప్ అవసరం లేకుండానే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది.

ధర ఎంత? ఎక్కడ లభిస్తుంది?

ఇండియాలో N2F Wolf AI  స్మార్ట్ హెల్మెట్ ధర రూ.4,249గా ఉంటుంది. ఇది ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో కూడా సిమిలర్ ప్రైస్ రేంజ్‌లో అంటే రూ. 3,299 నుంచి అందుబాటులో ఉంది. వేరియంట్స్ ను బట్టి మారుతుంది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తో పాటు హెడ్ ఫాక్స్ ఆఫీషియల్ సైట్ లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ, 7 డేస్ రిటర్న్ పాలసీ అందుబాటులో ఉంది. ఇక ఈ హెల్మెట్ కు సంబంధించి ఏడాది పాటు వారంటీ ఉంటుంది. బ్లూటూత్, ఎలక్ట్రానిక్స్ పార్ట్స్‌ పై వారంటీ ఉంటుంది. ఇక ఈ హెల్మెట్ కు సంబంధించి వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ లభిస్తోంది. 4.4/5 రేటింగ్ పొందింది. క్వాలిటీ, సౌండ్, కనెక్టివిటీ బాగుందంటున్నారు. వైజర్ క్వాలిటీ, ఫిట్ గురించి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  వైజర్ క్వాలిటీ పెంచాలని కోరుతున్నారు.

Advertisement

Read Also: BMW నుంచి క్రేజీ హెల్మెట్లు.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×