E-Paper
Advertisement

అడ్వెంచర్ బైక్ లవర్స్ కు పండుగే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 4 క్రేజీ బైక్స్ ఎంట్రీ!

అడ్వెంచర్ బైక్ లవర్స్ కు పండుగే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 4 క్రేజీ బైక్స్ ఎంట్రీ!
Advertisement

New Royal Enfield Bikes Coming Soon: ఇండియన్ మోటార్‌ సైకిల్ మార్కెట్లో రాయల్ ఎన్‌ ఫీల్డ్‌ కు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు క్రూయిజర్ బైక్‌లకే పరిమితమైన ఈ కంపెనీ, ఇప్పుడు అడ్వెంచర్, స్క్రాంబ్లర్, ఎలక్ట్రిక్ బైక్‌ లతో తన పరిధిని మరింత విస్తరించింది. ముఖ్యంగా అడ్వెంచర్ టూరింగ్ సెగ్మెంట్ లో కంపెనీ మరిన్ని కొత్త మోడళ్లను తీసుకురావడానికి రెడీ అవుతోంది. త్వరలో మార్కెట్లోకి రానున్న నాలుగు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ లు ఏవనేది ఇప్పుడు చూద్దాం..

1.హిమాలయన్ 750

రాయల్ ఎన్‌ ఫీల్డ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బైక్‌ లలో హిమాలయన్ 750 ఒకటి. ఈ బైక్‌ను కంపెనీ ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ ఫామ్‌ పై రెడీ అవుతోంది. ఈ బైక్‌ లో కొత్త ఛాసిస్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, పెద్ద వీల్స్, ట్విన్ డిస్క్ బ్రేక్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ దీనిని రెండు వేరియంట్లలో తీసుకురావొచ్చని సమాచారం. ఒకటి రోడ్ ప్రయాణాల కోసం, మరొకటి కంప్లీట్ అడ్వెంచర్ రైడింగ్ కోసం. ఇందులో కొత్త 750సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ సుమారు 55 బీహెచ్‌పీ పవర్, 65 ఎన్‌ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేయనుంది.

2.ఫ్లయింగ్ ఫ్లీ S6

Advertisement

రాయల్ ఎన్‌ ఫీల్డ్ ఇటీవల ఫస్ట్ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ప్లాట్‌ ఫామ్‌ పై స్క్రాంబ్లర్ స్టైల్‌ లో ఫ్లయింగ్ ఫ్లీ S6ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఈ బైక్ మరింత రగ్గడ్ డిజైన్‌ తో రానుంది. ఆఫ్ రోడ్ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రెడీ చేస్తున్నారు. ఇందులో 3.91 kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. పూర్తి ఛార్జ్‌ తో దాదాపు 154 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది.

3.హిమాలయన్ 440

ప్రస్తుతం ఉన్న స్క్రామ్ 440, హిమాలయన్ 450 మధ్య ఖాళీని భర్తీ చేసేందుకు కంపెనీ హిమాలయన్ 440ని  తీసుకురానుంది. ఈ బైక్ డిజైన్ పాత హిమాలయన్ 411ను గుర్తు చేసేలా ఉంటుంది. అయితే, ఇందులో మరిన్ని ఆధునిక ఫీచర్లు, కొత్త గ్రాఫిక్స్‌ ను జోడించే అవకాశం ఉంది. ఇందులో 443సీసీ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇంజిన్ 25.4 బీహెచ్‌పీ పవర్, 34 ఎన్‌ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

4.స్క్రామ్ 450

Advertisement

రాయల్ ఎన్‌ ఫీల్డ్ ప్రస్తుతం మరో కొత్త స్క్రాంబ్లర్ బైక్ అయిన స్క్రామ్ 450ని కూడా తయారు చేస్తోంది. ఇది గెరిల్లా 450లో ఉపయోగించిన షెర్పా ప్లాట్‌ ఫామ్ ఆధారంగా రూపొందుతోంది.  ఈ బైక్‌లో మినిమల్ బాడీ ప్యానెల్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, డ్యూయల్ పర్పస్ టైర్లు వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అడ్వెంచర్‌ తో పాటు రోజువారీ ప్రయాణాలకు కూడా ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.  ఇందులో 452సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండనుంది. ఈ ఇంజిన్ సుమారు 40 బీహెచ్‌పీ పవర్, 40 ఎన్‌ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేయనుంది.

Read Also: ఈవీ మార్కెట్లో ఆంపియర్ జోరు.. 4 లక్షల యూనిట్ల అమ్మకాల మార్క్ క్రాస్!

Related News

25 కి.మీ మైలేజ్, 6 ఎయిర్‌ బ్యాగ్స్ సేఫ్టీ.. రూ.10 లక్షల్లోపు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే!

145 కి.మీ రేంజ్ తో కొత్త స్కూటర్.. ధర కూడా తక్కువేనండోయ్!

కొత్త లుక్.. సరికొత్త ఫీచర్లు.. కొత్త బాలెనో వచ్చేస్తోంది!

సూపర్ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్ కొత్త వెర్షన్ వచ్చేసింది!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉబెర్, రాపిడోల్లో ముందే టిప్ అడగటం కుదరదు.. కేంద్రం కొత్త రూల్స్!

ట్రక్కుల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? ఆ ‘OK’ వెనుక పెద్ద చరిత్రే ఉంది!

రూ.2 లక్షలకే అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. జస్ట్ రూ. 10 వేలతో బుక్ చేసుకోండి!

ఎంజీ హెక్టర్ హాక్ వచ్చేస్తోంది.. PHEV, ఎలక్ట్రిక్ వెర్షన్లతో అదిరిపోయే ఎంట్రీ!

Big Stories

Advertisement
×