E-Paper
Advertisement

అడ్వెంచర్ స్టైల్‌ తో హోండా ADV 160.. ఈ 5 ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

అడ్వెంచర్ స్టైల్‌ తో హోండా ADV 160.. ఈ 5 ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

New Honda ADV 160 Maxi-Scooter: ఇండియన్ టూ వీలర్స్ మార్కెట్ లో మ్యాక్సీ స్కూటర్లకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160 లాంటి మోడళ్లు ఈ సెగ్మెంట్ లో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు హోండా కూడా ఈ విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. హోండా ADV 160 స్కూటర్‌ ను 2026 చివర్లో లేదంటే 2027 ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అడ్వెంచర్ స్టైల్ డిజైన్, పవర్ ఫుల్ ఇంజిన్, అత్యాధునిక ఫీచర్లతో ఈ స్కూటర్ రానుంది. ఈ మోడల్ కు సంబంధించిన 5 కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1.సూపర్ డిజైన్

ఈ స్కూటర్ క్రేజీ డిజైన్ తో అందుబాటులోకి రానుంది. ఈ స్కూటర్ బరువు సుమారు 133 కిలోలు ఉండబోతోంది. 8.1 లీటర్ల ఇంధన ట్యాంక్‌ ను కలిగి ఉంటుంది. 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో గుంతలు, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై కూడా సులభంగా నడపవచ్చు.

2.పవర్ ఫుల్ 160సీసీ ఇంజిన్

Advertisement

హోండా ADV 160లో 156.9 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ eSP+ ఇంజిన్‌ ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 15.8 హెచ్‌పీ పవర్, 14.7 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్‌లో CVT ట్రాన్స్‌ మిషన్‌ ను అందించారు. అలాగే ACG స్టార్టర్ సిస్టమ్ వల్ల ఇంజిన్ సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. ఐడిల్-స్టాప్ టెక్నాలజీ కూడా ఉండటంతో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనం నిలిచినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగి ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

3.బ్రేకింగ్, సేఫ్టీ ఫీచర్లు

హోండా ADV 160 ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లను అందిస్తోంది. ముందు వీల్ కు సింగిల్ ఛానల్ ABS సిస్టమ్ కూడా ఉంటుంది. సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా ఇందులో అందించే అవకాశం ఉంది. రోడ్డుపై జారుడు పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సిస్టమ్ వెనుక చక్రం ట్రాక్షన్‌ ను మెరుగుపరచి సురక్షితమైన రైడింగ్ ను అందిస్తుంది.

4.అడ్వెంచర్ స్టైల్ లుక్

Advertisement

ఈ మ్యాక్సీ స్కూటర్‌ లో పొడవైన విండ్‌ స్క్రీన్, షార్ప్ ఫ్రంట్ డిజైన్, పెద్ద సీటు, చక్కటి పొజిషన్ ఉన్నాయి. రైడర్ అవసరానికి అనుగుణంగా విండ్‌ స్క్రీన్‌ ను సర్దుబాటు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. సీటు కింద పెద్ద స్టోరేజ్ స్పేస్‌ను అందించారు.  రోజువారీ అవసరాల కోసం వస్తువులను సులభంగా తీసుకెళ్లొచ్చు.

5.అదిరిపోయే ఫీచర్లు  

హోండా ADV 160లో పూర్తిగా LED లైటింగ్ సిస్టమ్, డిజిటల్ LCD ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్ కీ సిస్టమ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి. ఈ ఫీచర్లు స్కూటర్‌ ను మరింత ప్రీమియంగా మార్చనున్నాయి.

భారత మార్కెట్లో ఎవరికి పోటీ?

హోండా ADV 160 నేరుగా యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160 వంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది. అడ్వెంచర్ స్టైల్ డిజైన్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, ప్రీమియం ఫీచర్లతో ఈ స్కూటర్ భారతీయ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Also: మారుతి To టాటా.. తక్కువ బడ్జెట్‌ లో సన్‌ రూఫ్ తో వచ్చే టాప్ 5 మోడల్స్ ఇవే!

Related News

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!

వాహనాలకు ఇన్సురెన్స్ అవసరమా? దాని వల్ల ఉపయోగాలేంటీ?

ఈవీ మార్కెట్ లో టీవీఎస్ దూకుడు.. జస్ట్ 7 నెలల్లో 3 లక్షలకుపైగా స్కూటర్ల సేల్!

కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు!

టాటా To కియా.. రూ.20 లక్షల్లోపు బెస్ట్ సౌండ్ సిస్టమ్ కార్లు ఇవే!

టియాగో ఈవీ To విండ్సర్ ఈవీ.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

BYD చౌకైన ఈవీ వచ్చేస్తోంది.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!

ఏథర్ కొత్త స్కూటర్‌కు ‘కోనార్క్’ పేరు ఎందుకు? అసలు విషయం చెప్పిన సీఈఓ మెహతా!

Big Stories

Advertisement
×