E-Paper
Advertisement

Honda ZR-V Hybrid SUV: ఇండియన్ మార్కెట్ లోకి హోండా ఫస్ట్ హైబ్రిడ్ SUV ఎంట్రీ.. ZR-V ఫీచర్లు, మైలేజ్ అదుర్స్!

Honda ZR-V Hybrid SUV: ఇండియన్ మార్కెట్ లోకి హోండా ఫస్ట్ హైబ్రిడ్ SUV ఎంట్రీ..  ZR-V ఫీచర్లు, మైలేజ్ అదుర్స్!
Advertisement

ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హోండా కార్ ఇండియా సరికొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త హైబ్రిడ్ SUV అయిన హోండా ZR-V ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ మోడల్ భారత్ లో తొలి హోండా హైబ్రిడ్ SUVగా అడుగు పెట్టింది. ఇప్పటికే ఎలివేట్ SUVతో మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకున్న హోండా, ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్‌ లో ZR-Vతో అడుగుపెడుతోంది. ఈ SUVకి సంబంధించిన బుకింగ్స్ దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జూలై 15 తర్వాత నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

CBU యూనిట్ గా భారత్ లోకి ఎంట్రీ

హోండా ZR-V SUV జపాన్ నుంచి కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) రూపంలో భారత్ కు తీసుకురానున్నారు. అందువల్ల దీని ధర కూడా ప్రీమియం స్థాయిలో ఉండనుంది. వైట్, గ్రే, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ కారు అందుబాటులోకి రానుంది. ఈ కారు  ప్రస్తుతం హోండా ఇండియా లైనప్‌ లోనే అతిపెద్ద మోడల్‌ గా నిలుస్తోంది. దీని పొడవు 4,657 మిమీ కాగా, వెడల్పు 1,840 మిమీ, ఎత్తు 1,621 మిమీగా ఉంది. 2,655 మిమీ వీల్‌ బేస్‌ తో వచ్చే ఈ SUV రోడ్డు మీద బలమైన ప్రెజెన్స్‌ ను ఇస్తుంది. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ దీనికి మరింత ప్రీమియం లుక్‌ ను అందిస్తున్నాయి.

హోండా ZR-V ఇంజిన్ గురించి..

Advertisement

ZR-Vలో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ ను హోండా అందించింది. ఈ సెటప్ 181 bhp పవర్, 315 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. గరిష్ట వేగం గంటకు 173 కిలోమీటర్లు. అయితే, ఈ SUVలో ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. లీటర్ పెట్రోల్‌ కు 22.80 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని హోండా ప్రకటించింది.  ఇది దేశంలో అత్యంత ఫ్యూయల్ ఎఫిషియెంట్ ప్రీమియం పెట్రోల్ SUVల్లో ఒకటిగా నిలవనుంది.

ప్రీమియం లుక్ తో ఆకట్టుకుంటున్న క్యాబిన్

క్యాబిన్‌ లో పూర్తిగా నలుపు రంగు థీమ్‌ తో ప్రీమియం ఫీలింగ్‌ ను కలిగించేలా డిజైన్ చేశారు. లెదర్ సీట్లు, మెటాలిక్ ఫినిషింగ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఇంటీరియర్‌ కు ఆకర్షణను పెంచుతున్నాయి. 9 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, 10 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, 12 స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రతా పరంగా కూడా హోండా ఎలాంటి రాజీ పడలేదు. మొత్తం ఎనిమిది ఎయిర్‌ బ్యాగ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ మానిటరింగ్ లాంటి ఆధునిక సేఫ్టీ టెక్నాలజీ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అదనంగా హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

ధర ఎంత అంటే?

Advertisement

ఈ కారుకు సంబంధించిన ధరను వచ్చే నెలలో అధికారిక ధరలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇది పూర్తిగా దిగుమతి మోడల్ కావడంతో ప్రారంభ ధర సుమారు రూ.45 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఈ కారు SUV ప్రీమియం సెగ్మెంట్‌ లో స్కోడా కొడియాక్, వోగ్స్ వ్యాగన్ టిగున్ R-Line లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: భారత్‌ లో కొత్త బైక్‌ల హంగామా.. మే ఎండింగ్ లో లాంచ్ కానున్న టాప్ 5 మోడళ్లు ఇవే!

Related News

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×