E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది!

సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నుంచి  క్రేజీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది!
Advertisement

Hyundai Upcoming EV SUV: భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ  సంస్థ హ్యుందాయ్ కొత్త సబ్-4 మీటర్ల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ కొత్త మోడల్ భారత మార్కెట్‌ తో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ దీనిని అంతర్గతంగా HE1i కోడ్ పేరుతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2026 చివర్లో లేదంటే 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు కొత్త మోడల్స్ విడుదల చేయాలనే ప్రణాళికలో భాగంగా ఈ మోడల్‌ ను తీసుకురానుంది.

డిజైన్ గురించి..

ఈ ఎస్‌యూవీ గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఇన్‌ స్టర్ ఈవీ నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. పొడవుగా, బాక్సీ స్టైల్‌ లో ఉండే ఈ వాహనం పూర్తిస్థాయి SUV లుక్‌ ను అందించనుంది. ముందుభాగంలో క్లోజ్డ్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ ల్యాంప్ సెటప్, LED డే టైమ్ రన్నింగ్ లైట్లు లాంటి ఆధునిక డిజైన్ అంశాలు కనిపించే అవకాశం ఉంది. వెహికల్ సైడ్ ప్రొఫైల్ కూడా ఆకర్షణీయంగా ఉండనుంది. బ్లాక్ ఫినిష్ ORVMలు, రూఫ్ రైల్స్, బాడీ క్లాడింగ్, పెద్ద అల్లాయ్ వీల్స్.. దీనికి మరింత స్టైలిష్ లుక్‌ను ఇవ్వనున్నాయి. వెనుక భాగంలో ప్రత్యేక LED లైటింగ్ సిగ్నేచర్ ఉండే అవకాశం ఉంది.

ఇంటీరియర్ గురించి..

Advertisement

హ్యుందాయ్ ఈ మోడల్ కు సంబంధించి ఆధునిక ఫీచర్లతో కూడిన ప్రీమియం క్యాబిన్‌ ను అందించే అవకాశం ఉంది. ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే కోసం రెండు పెద్ద స్క్రీన్లు ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌ రూఫ్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వాహనంలో వెహికల్ టు లోడ్ (V2L) టెక్నాలజీ కూడా ఉండే అవకాశం ఉంది.

భద్రత విషయంలోనూ నో కాంప్రమైజ్

భద్రత పరంగా కూడా ఈ SUV ప్రత్యేకంగా ఉండనుంది. 6, 7 ఎయిర్‌ బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, అలాగే లెవెల్-2 ADAS లాంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు ఇందులో ఉండవచ్చని తెలుస్తోంది. ఇవి డ్రైవింగ్‌ ను మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి.

ఒకే ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్

Advertisement

ఈ మోడల్ లో 42 kWh, 49 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌లను అందించే అవకాశం ఉంది. వేరియంట్‌ ను బట్టి ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 300 నుంచి 355 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ SUVలో ఉంది. DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని అంచనా. ఈ మోడల్ టాటా పంచ్ ఈవీ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read Also: కియా కస్టమర్లకు షాక్.. జూలై 1 నుంచి అన్ని మోడల్స్ ధరలు పెంపు!

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×