Jeep Car Discounts October 2026: కారు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి జీప్ ఇండియా అక్టోబర్ నెలలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చెరోకీ మోడళ్లపై అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లతో పాటు కార్పొరేట్ ఆఫర్లు, స్పెషల్ కస్టమర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అయితే, జీప్ రాంగ్లర్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మాత్రం ఈ నెలలో ఎలాంటి స్పెషల్ ఆఫర్లు లేవు.
జీప్ ఇండియా ఎంట్రీ లెవల్ SUV అయిన కంపాస్‌పై అక్టోబర్‌లో రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. అయితే అన్ని వేరియంట్లకు ఈ ఆఫర్ వర్తించదు. ఎంపిక చేసిన వేరియంట్లపై మాత్రమే ఈ బెనిఫిట్స్ లభిస్తాయి. కొన్ని కంపెనీల ఉద్యోగులు, అర్హత ఉన్న కస్టమర్లకు రూ.1.1 లక్షల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. డాక్టర్లు, లీజింగ్ కంపెనీలకు అదనంగా రూ.15,000 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. కంపాస్‌లో 170hp పవర్ అందించే 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజన్ ఉంటుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 4×4 సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ SUV ధరలు రూ.17.99 లక్షల నుంచి రూ.30.70 లక్షల వరకు ఉన్నాయి.
మూడు వరుసల సీట్లతో వచ్చే జీప్ మెరిడియన్‌పై కూడా కంపెనీ ఈ నెలలో అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన వేరియంట్లపై మొత్తం రూ.1.65 లక్షల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. MY24 యూనిట్లను కొనుగోలు చేసే వారికి రూ.1.3 లక్షల వరకు కార్పొరేట్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు, లీజింగ్ కంపెనీలకు మరో రూ.30,000 వరకు స్పెషల్ బెనిఫిట్స్ లభిస్తుంది. మెరిడియన్‌లో కూడా కంపాస్‌కు సంబంధించిన అదే 170hp 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 4×4 సిస్టమ్ కూడా లభిస్తుంది. మెరిడియన్ ధరలు రూ.23.33 లక్షల నుంచి రూ.38.26 లక్షల వరకు ఉన్నాయి.
జీప్ ఫ్లాగ్‌షిప్ SUV అయిన గ్రాండ్ చెరోకీపై ఈ నెలలో అత్యధిక బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. అర్హత ఉన్న కొనుగోలుదారులు రూ.4 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో పాటు జీప్ వేవ్ ఎక్స్ క్లూజివ్ ఓనర్ షిప్ ప్రోగ్రామ్‌కు ఫ్రీ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇందులో మూడేళ్ల వారంటీ ప్యాక్, ఎక్స్ ప్రెస్ సర్వీసింగ్, అడ్వెంచర్ కన్సియర్జ్ లాంటి పలు ఆఫ్టర్ సేల్స్ ప్రయోజనాలు ఉంటాయి. గ్రాండ్ చెరోకీని భారత్‌లో ఒకే వేరియంట్‌లో విక్రయిస్తున్నారు. ఇందులో 272hp పవర్ ఇచ్చే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4×4 సిస్టమ్ ఉన్నాయి. దీని ధర రూ.63 లక్షలు.
Read Also: కార్ల మార్కెట్‌లో పండుగ జోష్.. సెప్టెంబర్ అమ్మకాల్లో బిగ్ జంప్.. టాప్ కంపెనీల సేల్స్ ఇవే!