E-Paper
Advertisement

జూలై కార్ సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇండియన్ కంపెనీస్ ఏ ప్లేస్ లో ఉన్నాయంటే?

జూలై కార్ సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇండియన్ కంపెనీస్ ఏ ప్లేస్ లో ఉన్నాయంటే?
Advertisement

India Car Sales Report July 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్‌ లో జూలై 2026 నెల అమ్మకాలు కొత్త జోష్ నింపాయి. అన్ని బ్రాండ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే మంచి వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ మరోసారి దేశీయ మార్కెట్లో సత్తా చాటింది. మహీంద్రా 60 వేలకుపైగా SUVలను విక్రయించగా, హ్యుందాయ్ కూడా రికార్డు స్థాయి అమ్మకాలతో మంచి ఫలితాలు సాధించింది. మరోవైపు ఎంజీ మోటార్ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది.

టాటా మోటార్స్‌ కు రికార్డు నెల

జూలై 2026లో టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో 62,611 ప్యాసింజర్ కార్లను అమ్మింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 58 శాతం కంటే ఎక్కువ వృద్ధి సాధించింది. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులను కలుపుకుంటే మొత్తం 63,760 వాహనాలను విక్రయించింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా టాటా మరో మైలురాయి సాధించింది. ఒకే నెలలో 15,217 ఈవీలను విక్రయించి తొలిసారి 15 వేల మార్కును దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఈవీ అమ్మకాలు 113 శాతం పెరిగాయి. టాటా పంచ్ మోడల్ కూడా తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

మహీంద్రా, హ్యుందాయ్ దూకుడు

Advertisement

మహీంద్రా అండ్ మహీంద్రా జూలై నెలలో దేశీయ మార్కెట్లో 60,048 SUVలను విక్రయించింది. మొత్తం అమ్మకాలు 1,03,860 యూనిట్లకు చేరగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 26 శాతం వృద్ధి. కమర్షియల్ వాహనాల అమ్మకాలు కూడా 25,204 యూనిట్లకు చేరి మంచి ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ అధికారులు అన్ని విభాగాల్లో డిమాండ్ బలంగా కొనసాగుతోందని తెలిపారు. కొత్త మోడళ్లకు లభిస్తున్న ఆదరణతో రాబోయే నెలల్లో కూడా ఇదే ఊపు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా జూలైలో మొత్తం 75,360 వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయంగా 54,210 యూనిట్లు, ఎగుమతుల ద్వారా 21,150 యూనిట్లు ఉన్నాయి. కంపెనీ చరిత్రలో జూలై నెలలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవేనని హ్యుందాయ్ వెల్లడించింది.

Advertisement

Read Also: మారుతి నుంచి మరో సర్‌ప్రైజ్.. త్వరలో XL6 ఫేస్‌ లిఫ్ట్ గ్రాండ్ ఎంట్రీ!

ఎంజీ మోటార్‌కు కూడా రికార్డు

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కూడా జూలై నెలలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. కంపెనీ మొత్తం 8,158 వాహనాలను విక్రయించి తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం అమ్మకాలలో 80 శాతానికి పైగా న్యూ ఎనర్జీ వెహికల్స్ వాటా ఉండటం విశేషం.

జూలై 2026 భారత కార్ల మార్కెట్‌కు మంచి నెలగా నిలిచింది. టాటా, మహీంద్రా, హ్యుందాయ్, ఎంజీ లాంటి ప్రధాన కంపెనీలు మంచి వృద్ధిని నమోదు చేయడంతో పాటు వినియోగదారుల నుంచి కూడా మంచి ఆదరణ పొందాయి. కొత్త మోడళ్ల విడుదల, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి కారణంగా రాబోయే నెలల్లో కూడా ఆటోమొబైల్ రంగం ఇదే జోరును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: స్కార్పియో N ఫేస్‌ లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్.. కొత్త ఫీచర్లు ఇవే!

Tags

Related News

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!

హీరో నుంచి కొత్త బైక్.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ స్పై షాట్స్!

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×