E-Paper
Advertisement

అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. కనిపించే దేవుడు అంటూ..

అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. కనిపించే దేవుడు అంటూ..
Advertisement

Allu Arjun Father: తండ్రి ప్రేమే ఒక కొడుకుకు కొండంత అండ. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సంస్కారాన్ని నేర్పేది, సమాజంలో తలఎత్తుకు నిలబడేలా చేసేది నాన్నే. సరిగ్గా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారిపై ఆయన కురిపించిన ప్రేమ, కృతజ్ఞత ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఫాదర్స్ డే సందర్బంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.

Read also-ఇండియన్ ఫేవరెట్ సూపర్‌హీరో ఈజ్ బ్యాక్.. తేజ సజ్జ ‘హనుమాన్’ 3D ట్రైలర్ విడుదల!

Advertisement

“నా తండ్రి నాకు దేవుడు. నేను చూడగలిగే, వినగలిగే, మాట్లాడగలిగే, తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో నాకు దాదాపు ప్రతి ఒక్కటి ఇచ్చిన వ్యక్తి నా తండ్రి. మా నాన్నకు, ప్రపంచంలోని ప్రతి మధురమైన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు.” అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చారు.

నెటిజన్ల ప్రశంసలు

ఒక పాన్-ఇండియా స్టార్‌గా, ‘పుష్ప’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకుని దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, అల్లు అర్జున్ తన తండ్రి పట్ల చూపిన ఈ వినమ్రత అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కంటికి కనిపించని దేవుడి కంటే, మనల్ని నడిపించే నాన్నే ప్రత్యక్ష దైవమంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. అల్లు అర్జున్ కెరీర్ ఆరంభం నుండి ఆయనను సరైన స్క్రిప్ట్‌లు, ప్రాజెక్ట్‌లతో గైడ్ చేస్తూ, ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉండటానికి అల్లు అరవింద్ పడిన తపన మనకు తెలిసిందే. ఆ కృతజ్ఞతను బన్నీ ఈ విధంగా చాటుకున్నారు.

Advertisement

Read also-నటుడు ప్రకాష్ రాజ్‌కు షాక్.. ఓటర్ ఐడీల వివాదంలో నాన్-బెలెబుల్ వారెంట్!

వైరల్ అవుతున్న పోస్ట్..

బన్నీ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. “నాన్నపై మీకున్న ప్రేమ అద్భుతం అన్నా”, “తండ్రికి ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఈ అపురూపమైన బంధం, నేటి యువతకు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

8గంటలు నీళ్లలోనే.. చెప్పుల్లేకుండా పర్వతోరహణ.. ‘మైసా’ వెనుక రష్మిక కష్టాలు!

ఆధార్ కార్డ్ చూపించి మరీ రియల్ ఏజ్ చెప్పేసిన వైష్ణవి చైతన్య!

“నేను బ్రతికే ఉన్నాను”.. సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి వడివుక్కరశి ఆవేదన!

విడాకుల పై కాజల్ షాకింగ్ కామెంట్స్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

బాలయ్య ‘దాదా’ నుంచి బిగ్ అప్డేట్.. థమన్ చెప్పింది ఇదే!

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

Big Stories

Advertisement
×