Kia Sonet Record Sales: ఇండియాలో కియా కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి లుక్, అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటుంది. కియా పాపులర్ మోడల్ అయిన సోనెట్ SUV దేశంలో కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఏకంగా 35 శాతం ఆక్రమించింది. మనదగ్గర తయారు చేసిన సోనెట్ దాదాపు 70 అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయబడుతుంది. 100,000 యూనిట్లకు పైగా మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయి.
సబ్ కాంపాక్ట్ SUV కియా సోనెట్ వరుసగా రెండు సంవత్సరాల్లో 100,000 యూనిట్లకు పైగా వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. పలు పవర్‌ట్రెయిన్, ట్రాన్స్ మిషన్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్న సోనెట్ , హై స్పెసిఫికేషన్ ట్రిమ్‌లతో మంచి డిమాండ్ సాధించింది. కియా ఇండియా ప్రస్తుతం దాని అమ్మకాలు, సర్వీసింగ్ సపోర్ట్ కోసం 369 నగరాల్లో 821 టచ్ పాయింట్ల ను ఏర్పాటు చేసింది.
కియా మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో సోనెట్ కీలక పాత్ర పోషిస్తుంది. పట్టణ, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఈ మోడల్ విజయానికి దాని ఇంజిన్ ఎంపికల శ్రేణి, ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఫీచర్లు కారణమని చెప్పవచ్చు. ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా, కంపెనీ సబ్ కాంపాక్ట్ SUV విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఇది భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో అత్యంత పోటీని ఇచ్చే బ్రాండ్ లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: ఇండియన్స్ ఏ కలర్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతారో తెలుసా? కారణం ఇదే!
ఏడాదిలో 5 లక్షల యూనిట్లు అమ్మడంపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్ హాక్ పార్క్ సంతోషం వ్యక్తం చేశారు. సోనెట్ 500,000 అమ్మకాల మైలురాయిని దాటడం కియా ఇండియాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్ముడైన ప్రతి సోనెట్ కియా వినియోగదారులను విశ్వాసాన్ని పొందుతున్నట్లు వెల్లడించారు. భారతీయ కొనుగోలుదారులు తమ కంపెనీ మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారని, అందుక నిదర్శనం ఈ కారు కొనుగోళ్లు అన్నారు. కంపెనీ తన ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. మంచి డిజైన్, అధునాతన సాంకేతికత, నమ్మదగిన పనితీరును అందించడం వల్లే తమను ప్రజలు నమ్ముతున్నారని, ఆ నమ్మకానికి ఏమాత్రం డ్యామేజ్ కలగకుండా చూసుకునే బాధ్యత తమదని చెప్పుకొచ్చారు. కార్ల కొనుగోలుతో సహకరించిన కస్టమర్లకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.