E-Paper
Advertisement

మారుతి సుజుకి నుంచి మరో ఈవీ వచ్చేస్తోంది.. ఏ మోడల్ అంటే?

మారుతి సుజుకి నుంచి మరో ఈవీ వచ్చేస్తోంది.. ఏ మోడల్ అంటే?
Advertisement

Maruti Second EV Coming Soon: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి తన దూకుడును మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే  ఇ-విటారాతో ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి అడుగుపెట్టిన కంపెనీ.. వచ్చే ఏడాది  రెండో ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. 2027 భారత్ మొబిలిటీ ఎక్స్‌ పో వేదికగా ఈ కొత్త మోడల్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది.

మారుతి రెండో ఈవీ మోడల్ ఏంటి?

కొత్తగా రాబోయే ఎలక్ట్రిక్ కారు ఏ మోడల్ ఆధారంగా తయారవుతుందనే విషయాన్ని మారుతి సుజుకి ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ప్రస్తుతం ఈ కొత్త ఈవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులో ప్రధానంగా రెండు మోడళ్ల పేర్లు చర్చకు వస్తున్నాయి. మొదటి అవకాశం ఎర్టిగా ఆధారంగా రూపొందుతున్న ఎలక్ట్రిక్ ఎంపీవీ. ఈ మూడు వరుసల ఎలక్ట్రిక్ వాహనం ఇప్పటికే భారత రోడ్లపై పరీక్షల్లో కనిపించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎంపీవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మారుతి ఈ విభాగంలోకి రావడం కంపెనీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. మారుతి ఎర్టిగా ఈవీని సరసమైన ధరలో తీసుకొస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర మూడు వరుసల ఎలక్ట్రిక్ ఎంపీవీలకు గట్టి పోటీ ఇవ్వొచ్చు. ముఖ్యంగా కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ కంటే తక్కువ ధర ఉంటే,  దేశంలోనే అత్యంత చౌకైన మూడు వరుసల ఎలక్ట్రిక్ ఎంపీవీగా నిలిచే అవకాశం ఉంది.

Advertisement

అటు బ్రెజ్జా లేదంటే ఫ్రాంక్స్ ఆధారంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రెజ్జా ఈవీ లేదా ఫ్రాంక్స్ ఈవీని తీసుకురావడం మారుతికి వ్యూహాత్మకంగా ఉపయోగపడొచ్చు. నాలుగు మీటర్ల లోపు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, కియా సైరోస్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ లాంటి మోడళ్లు పోటీ పడుతున్నాయి. ఒకవేళ ఫ్రాంక్స్ ఈవీ మార్కెట్లోకి వస్తే టాటా పంచ్ ఈవీ, సిట్రోయెన్ eC3 వంటి మోడళ్లకు కూడా పోటీ పెరిగే అవకాశం ఉంది.

భారత మార్కెట్ లోకి ఎనిమిది ఎస్‌యూవీలు

భారత మార్కెట్ కోసం మొత్తం ఎనిమిది ఎస్‌యూవీలతో కూడిన పెద్ద పోర్ట్‌ ఫోలియోపై పని చేస్తున్నట్లు మారుతి ఇప్పటికే వెల్లడించింది. ఇందులో తొలి మోడల్‌ గా విక్టోరిస్ మార్కెట్లోకి వచ్చింది. మిగిలిన మోడళ్లను 2030 నాటికి దశలవారీగా తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక మారుతి తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుగా ఇ-విటారాను ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. మూడు వేరియంట్లు, పది రంగులు, రెండు బ్యాటరీ ఎంపికలతో ఇ-విటారా అందుబాటులో ఉంది. మారుతి రెండో ఎలక్ట్రిక్ కారుగా ఎర్టిగా, బ్రెజ్జా,  ఫ్రాంక్స్‌లో ఏ మోడల్‌ను ఎంచుకుంటుందనే దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

Advertisement

Read Also: జీరో To హీరో.. ఈవీ మార్కెట్ లో దుమ్మురేపుతున్న విన్‌ఫాస్ట్‌!

Tags

Related News

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

Big Stories

Advertisement
×