E-Paper
Advertisement

మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ vs టయోటా హిలక్స్.. ఏ పికప్ బెస్ట్?

మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ vs టయోటా హిలక్స్.. ఏ పికప్ బెస్ట్?
Advertisement

Mahindra Scorpio Lifestyler vs Toyota Hilux:  మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. స్కార్పియో N ఆధారంగా రూపొందిన ఈ పికప్‌ కు మహీంద్రా ప్రత్యేకమైన లైఫ్‌ స్టైల్ లుక్ ఇచ్చింది. ఇదే సమయంలో టయోటా హిలక్స్ ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ రెండు పికప్‌లలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డిజైన్‌లో ఏది బెటర్?

స్కార్పియో లైఫ్‌స్టైలర్ ముందు భాగం చాలా బోల్డ్‌ గా కనిపిస్తుంది. స్క్వేర్ ఆకారంలో ఉండే LED హెడ్‌ ల్యాంప్స్, పెద్ద క్రోమ్ గ్రిల్, నిలువుగా ఉన్న ఫాగ్ ల్యాంప్స్ దీనికి ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. హిలక్స్ కొంచెం భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంది. సన్నని LED హెడ్‌ ల్యాంప్స్, పెద్ద హనీకోంబ్ గ్రిల్, టయోటా లోగోతో ముందు భాగం రగ్గడ్‌ గా కనిపిస్తుంది. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్ ఎలా ఉంది?

Advertisement

స్కార్పియో లైఫ్‌స్టైలర్ క్యాబిన్‌ ను ఆధునికంగా, ప్రీమియంగా రూపొందించింది. పెద్ద పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్, డ్యూయల్ టోన్ డ్యాష్‌ బోర్డ్, సిల్వర్ యాక్సెంట్స్‌ తో కూడిన స్టీరింగ్ వీల్ ఉన్నాయి. హిలక్స్ క్యాబిన్‌లో రగ్గడ్ ఫీల్‌ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పెద్ద ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్, మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.   ప్రీమియం ఎక్స్ పీరియెన్స్ లో స్కార్పియో లైఫ్‌స్టైలర్ ముందుండే అవకాశం ఉంది.

ఫీచర్లలో స్కార్పియో దూకుడు   

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం ఆడియో సిస్టమ్, సన్‌రూఫ్, ఆటో డిమ్మింగ్ IRVM వంటి ఫీచర్లు ఉన్నాయి. హిలక్స్‌ లో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

భద్రతలో ఏది బెస్ట్?

Advertisement

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ లో లెవల్ 2 ADAS, 540 డిగ్రీ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 6 ఎయిర్‌ బ్యాగ్స్, ESC, TPMS, ISOFIX, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. హిలక్స్‌ లో 7 ఎయిర్‌ బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అయితే అధునాతన టెక్నాలజీ విషయంలో స్కార్పియో లైఫ్‌ స్టైలర్‌  కాస్త ముందుంటుంది.

ఇంజిన్, పవర్ గురించి

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ లో 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు రావచ్చని అంచనా. పెట్రోల్ ఇంజిన్ 203 PS వరకు పవర్, డీజిల్ 175 PS వరకు పవర్ అందించవచ్చని సమాచారం. హిలక్స్‌ లో 2.8-లీటర్ డీజిల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ ప్రధానంగా ఉంది. ఇది 204 PS పవర్, 400 Nm టార్క్‌ను అందిస్తుంది.

ధరలో భారీ తేడా

స్కార్పియో లైఫ్‌స్టైలర్ ధర సుమారు రూ.19.79 లక్షల ఎక్స్‌షోరూమ్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టయోటా హిలక్స్ ధర రూ.31.99 లక్షల నుంచి రూ.36.69 లక్షల వరకు ఉంది. అంటే ధర పరంగా స్కార్పియో లైఫ్‌స్టైలర్ చాలా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Read Also:కొత్త లుక్ లో నార్టన్ మ్యాంక్స్ ఆర్‌.. పింక్, పర్పుల్ లో అదిరిందయ్యా!

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×