E-Paper
Advertisement

కొత్త లుక్ లో నార్టన్ మ్యాంక్స్ ఆర్‌.. పింక్, పర్పుల్ లో అదిరిందయ్యా!

కొత్త లుక్ లో నార్టన్ మ్యాంక్స్ ఆర్‌.. పింక్, పర్పుల్ లో అదిరిందయ్యా!
Advertisement

Norton Manx R One- Off: బ్రిటన్‌కు చెందిన ప్రీమియం బైక్ కంపెనీ నార్టన్ తన మ్యాంక్స్ ఆర్ సూపర్‌ బైక్‌ కు స్పెషల్  వెర్షన్‌ ను పరిచయం చేసింది. బ్రిటిష్ ఆర్ట్ అండ్ డిజైన్ సంస్థ పీస్‌ ఫుల్ రీసెర్చ్‌ తో కలిసి ఈ ప్రత్యేకమైన బైక్‌ను రూపొందించింది. 2026 బ్రిటిష్ మోటోజీపీ సందర్భంగా సిల్వర్‌ స్టోన్‌ లో జరిగిన కార్యక్రమంలో మ్యాంక్స్ ఆర్ పేరుతో ఈ బైక్‌ను తొలిసారి ప్రదర్శించారు.

స్పెషల్ కలర్ మిక్సింగ్

ఈ వన్ ఆఫ్ మ్యాంక్స్ ఆర్ సాధారణ మోడల్‌ తో పోలిస్తే పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది. మెటాలిక్ పింక్, డీప్ పర్పుల్, లైట్ గ్రే రంగులను కలిపి బైక్‌కు కొత్త లుక్ ఇచ్చారు. బాడీవర్క్‌ పై పీస్‌ ఫుల్ రీసెర్చ్ రూపొందించిన ప్రత్యేక గ్రాఫిక్స్‌ ను కూడా యాడ్ చేశారు. బైక్ వెనుక భాగంలో కనిపించే ‘26’ గ్రాఫిక్ ఈ ప్రాజెక్ట్ 2026లో అందుబాటులోకి తీసుకొచ్చిన  విషయాన్ని సూచిస్తుంది. రంగులు, గ్రాఫిక్స్ తో ఈ బైక్ దూరం నుంచే ఆకట్టుకుంటుంది.

డిజైన్ లో ఛేంజెస్.. ఇంజిన్‌ లో నో ఛేంజెస్

Advertisement

ఈ ప్రాజెక్ట్‌ లో ప్రధానంగా బైక్ లుక్ మీదే దృష్టి పెట్టారు. మ్యాంక్స్ ఆర్‌ లోని మెకానికల్ గా ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే, సాధారణ మ్యాంక్స్ ఆర్‌ లో ఉన్న ఇంజిన్, గేర్‌ బాక్స్, ఇతర ప్రధాన భాగాలే ఈ వన్ ఆఫ్ మోడల్‌ లో కూడా కొనసాగాయి. బైక్‌ను పూర్తిగా విడదీసి, పెయింటింగ్, ర్యాపింగ్, లక్కరింగ్ లాంటి పనులు చేసి మళ్లీ అసెంబుల్ చేయడానికి సుమారు 10 రోజులు పట్టిందని నార్టన్ వెల్లడించింది.

నార్టన్ మ్యాంక్స్ ఆర్‌లో 1,200cc సామర్థ్యం కలిగిన 72-డిగ్రీ V4 ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 11,500rpm దగ్గర గరిష్ఠంగా 206hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 9,000rpm దగ్గర 130Nm గరిష్ఠ టార్క్ అందిస్తుంది. ఇంజిన్‌కు ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను జత చేశారు. వెట్ మల్టీ ప్లేట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్లతో మ్యాంక్స్ ఆర్ నార్టన్ లైనప్‌ లో అత్యంత శక్తివంతమైన మోడళ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది?

Advertisement

నార్టన్ మ్యాంక్స్ ఆర్ ఇప్పటికే భారత్ లో పేటెంట్ పొందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సూపర్‌ బైక్‌ను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. అయితే, అధికారికంగా విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మ్యాంక్స్ ఆర్‌తో పాటు V4 ఇంజిన్‌తో కూడిన ఇతర మోడళ్లను నార్టన్ బ్రిటన్‌ లోని సోలిహల్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తోంది. ఈ బైక్‌లకు అవసరమైన కొన్ని కీలక విడిభాగాలను భారత్ నుంచి సరఫరా చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Read Also: కొత్త లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650.. ఏమేం మారాయంటే?

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×