E-Paper
Advertisement

UPSC Jobs: యుపిఎస్‌సి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. రూ.2 లక్షలకు పైగా జీతం

UPSC Jobs: యుపిఎస్‌సి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. రూ.2 లక్షలకు పైగా జీతం
Advertisement

UPSC Jobs: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC ) 2026 నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదల చేసింది. మొత్తం 47 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నియామకాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు పలు స్పెషలిస్ట్, సైంటిఫిక్, అడ్మిన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. యుపిఎస్‌సి ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ORA) పోర్టల్ ద్వారా జూలై 31, 2026 సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఖాళీల వివరాలు

Advertisement

ఈ నియామక ప్రక్రియలో వివిధ విభాగాల్లో పోస్టులు
అసిస్టెంట్ సాయిల్ కెమిస్ట్ పోస్టులు 2
ప్రాసిక్యూటర్ పోస్టు 1
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు క్లినికల్ హీమటాలజీలో 9,
ఎండోక్రైనాలజీలో 10, నియోనటాలజీలో 13.
న్యూక్లియర్ మెడిసిన్‌లో 3,
పల్మనరీ మెడిసిన్‌లో 3 పోస్టులు
పీడియాట్రిక్ కార్డియాలజీలో 1,
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో 1 పోస్టు
డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (ఎంటమాలజీ) పోస్టులు 2
ఎంటమాలజిస్ట్ పోస్టు 1,
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (టాక్సికాలజీ) పోస్టు 1

విద్యార్హతలు

ప్రతి పోస్టుకు అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. మెడికల్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంబీబీఎస్ డిగ్రీ తప్పనిసరి. సంబంధిత సూపర్ స్పెషాలిటీలో పీజీ అర్హతతో పాటు బోధనా అనుభవం కూడా ఉండాలి.
ఇతర పోస్టులకు వ్యవసాయం, జంతుశాస్త్రం, టాక్సికాలజీ, పబ్లిక్ హెల్త్ ఎంటమాలజీ లేదా న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అవసరం. సంబంధిత రంగంలో అనుభవం కూడా ఉండాలి. పూర్తి అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ తప్పనిసరిగా పరిశీలించండి.

వయోపరిమితి

Advertisement

పోస్టును బట్టి గరిష్ఠ వయోపరిమితి మారుతుంది. కొన్ని పోస్టులకు 33 సంవత్సరాలు, మరికొన్నింటికి 45 సంవత్సరాల వరకు వయస్సు అనుమతిస్తారు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు ఉంటుంది. బెంచ్‌మార్క్ వికలాంగుల అభ్యర్థులకు కూడా ప్రత్యేక సడలింపులు వర్తిస్తాయి.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు 7వ సెంట్రల్ ప్లానింగ్ కమీషన్.. పే మ్యాట్రిక్స్ ప్రకారం జీతం చెల్లిస్తారు. పోస్టును బట్టి పే లెవల్ 8, 10 లేదా 11లో నియామకం ఉంటుంది. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ప్రాథమిక వేతనంతో పాటు నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ కూడా అందుతుంది. అంటే ఉద్యోగాన్ని బట్టి నెల జీతం బేసిక్ పే రూ.67,000, గ్రాస్ సాలరీ రూ.2,08,000 వరకు ఉంటుంది.

Also Read: 45 ఏళ్ల వయసులో 25 ఏళ్ల యవ్వనం.. ముడతల చర్మంలో జీవం పోసే జెల్.. ఇంట్లోనే తయారు చేయండి

దరఖాస్తు చివరి తేదీ

ఆన్‌లైన్ దరఖాస్తులను జూలై 31, 2026 సాయంత్రం 6 గంటలలోపు సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత యుపిఎస్‌సీ ఎలాంటి దరఖాస్తులను స్వీకరించదు. దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. తప్పు సమాచారం లేదా అసంపూర్ణ వివరాలు ఉంటే దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది.

Also Read: బ్యాంక్ క్లర్క్ జాబ్స్ గురూ.. రూ.40000 జీతం, డిగ్రీ ఉంటే చాలు

అభ్యర్థులకు సూచనలు

దరఖాస్తు చేసే ముందు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు, అనుభవం, ఎంపిక విధానం వంటి వివరాలను తెలుసుకోవాలి. సరైన సమాచారంతో దరఖాస్తు చేస్తే ఎంపిక ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.

Also Read: ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం

Related News

పసిడి ప్రియులకు తీపి కబురు.. దిగొస్తున్న బంగారం ధరలు, మహిళల్లో ఒక్కటే ఆనందం

పేటీఎం ఖేల్ ఖతం.. పేమెంట్స్ బ్యాంక్ మూసివేతకు హై కోర్టు ఆదేశాలు

Railway Jobs: రైల్వే టెక్నీషియన్ జాబ్.. జూలై 29 లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి

IBPS Clerk Vacancies: బ్యాంక్ క్లర్క్ జాబ్స్ గురూ.. రూ.40000 జీతం, డిగ్రీ ఉంటే చాలు

ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పార్లమెంటులో ప్రకటన, ఇంకా ఏం చెప్పిందంటే..

రూ.100 కోట్లపైగా ఆదాయం.. నాలుగు రెట్లుకు పెరిగిన భారతీయులు, వివరాలు బయటపెట్టిన కేంద్రం

క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా? జూలై 31 ఐటిఆర్ ఫైలింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు పాటించాలి

Big Stories

Advertisement
×