E-Paper
Advertisement

కొల్తూరు చెరువులో 15 లక్షల చేపలు మృతి.. ఫార్మా వ్యర్థాలే కారణమని మత్స్యకారుల ఆందోళన!

కొల్తూరు చెరువులో 15 లక్షల చేపలు మృతి.. ఫార్మా వ్యర్థాలే కారణమని మత్స్యకారుల ఆందోళన!
Advertisement

Fish Deaths: స్వేచ్ఛ: మూడు చింతల పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు పెద్ద చెరువులో భారీగా చేప పిల్లలు మృతి చెందడం కలకలం రేపుతోంది. చెరువుకు సమీపంలోని ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు నీటిలో కలవడం వల్లే చేప పిల్లలు మృత్యువాత పడ్డాయని స్థానికులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.చెరువులో సుమారు 15 లక్షల చేప పిల్లలు మృతి చెందినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో చెరువుపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో చేప పిల్లలు మృతి చెందడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఫిర్యాదు..

Advertisement

గతంలోనే ఫిర్యాదుచెరువు నీటి కాలుష్యంపై గత ఏడాదే కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అప్పట్లోనే అధికారులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నమూనాలు సేకరించి పరీక్షించాలి

Advertisement

చేప పిల్లల మృతికి అసలు కారణమేంటో తేల్చేందుకు అధికారులు వెంటనే చెరువు నీరు, మృతిచెందిన చేపల నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఫార్మా పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు చెరువులోకి చేరాయా? లేదా ఇతర కారణాలతో చేపలు మృతి చెందాయా? అన్నది సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.మత్స్యకారుల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించాలని, చెరువు కాలుష్యానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు, గ్రామస్థులు కోరుతున్నారు.

Also Read: బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే మ్యాచ్.. అసెంబ్లీ తీరుపై వైఎస్ జగన్ సెటైర్లు!

Tags

Related News

 KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?

రేవంత్ ఇల్లీగల్ సీఎం.. ఖర్గే వ్యాఖ్యలపై రామచంద్రరావు బిగ్ బాంబ్!

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

Big Stories

Advertisement
×