E-Paper
Advertisement

కొత్త లుక్‌లో పల్సర్ 125, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

కొత్త లుక్‌లో పల్సర్ 125, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

New Bajaj Pulsar 125 First Look: బజాజ్ పల్సర్ 125 త్వరలో సరికొత్తగా మార్కెట్లోకి రాబోతోంది. ఈ బైక్ ఇంకా అధికారికంగా విడుదల కాకపోయినా, ఇప్పటికే కొన్ని బజాజ్ డీలర్‌షిప్‌లకు చేరుకుంది. పూణేలోని ఓ డీలర్‌షిప్‌లో ఈ కొత్త బైక్‌ కనిపించింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త పల్సర్ 125లో డిజైన్ నుంచి ఫీచర్ల వరకు పలు కీలక మార్పులు అందుబాటులోకి వచ్చాయి.

పూర్తిగా కొత్త డిజైన్

కొత్త పల్సర్ 125లో ముందుభాగం, సైడ్ ప్రొఫైల్, వెనుక భాగాన్ని పూర్తిగా మార్చారు. అయినప్పటికీ బైక్‌ ను ఒరిజినల్ లుక్ ను అలాగే కంటిన్యూ చేశారు. హెడ్‌లైట్ కౌల్‌ కు మరింత స్పోర్టీ లుక్ ఇచ్చారు. కొత్త ఆల్-LED హెడ్‌లైట్ బైక్ ముందు భాగాన్ని మరింత ఆకట్టుకునేలా మార్చింది. మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, కొత్త ట్యాంక్ ఎక్స్‌ టెన్షన్స్ కూడా బైక్‌కు స్పెషల్ లుక్ ను అందిస్తున్నాయి. అయితే, వెనుక భాగంలో ఇచ్చిన కొత్త టెయిల్ లైట్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొత్త మోడల్‌ ఏ కలర్స్ లో వస్తుందనే విషయాలను బజాజ్ ఇంకా వెల్లడించలేదు.

కొత్త ఇంజిన్‌ తో వస్తుందా?

Advertisement

పల్సర్ 125లో ఇంజిన్ కూడా ఇప్పుడు కొత్తగా మారబోతోంది. ఇప్పటికీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌గానే ఉంటుంది. ఇంజిన్ కవర్ల డిజైన్‌ను కూడా మార్చారు. ప్రస్తుతం ఇంజిన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను బజాజ్ వెల్లడించలేదు. అయితే పవర్, టార్క్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, ఇంజిన్ పనితీరు, పవర్ డెలివరీ, ఇంధన సామర్థ్యంలో కొంత మెరుగుదల ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త ఇంజిన్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది.

ట్విన్ షాక్స్‌ కు బదులు మోనోషాక్

కొత్త పల్సర్ 125లో మరో ముఖ్యమైన మార్పు వెనుక సస్పెన్షన్. ఇప్పటివరకు ఉన్న ట్విన్ షాక్ అబ్జార్బర్ల స్థానంలో మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు. ముందు భాగంలో మాత్రం టెలిస్కోపిక్ ఫోర్క్స్ కొనసాగుతున్నాయి. బైక్ రెండు వైపులా 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందు భాగంలో డిస్క్ బ్రేక్, అదనపు భద్రత కోసం CBSను కూడా అందించారు.

ఫీచర్లలో కీలక అప్‌గ్రేడ్

Advertisement

కొత్త పల్సర్ 125లో ఫీచర్లకు బజాజ్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. టాప్ వేరియంట్‌లో ఇండికేటర్లతో సహా ఆల్-LED లైటింగ్ ఉంటుంది. అంతేకాదు, 5 అంగుళాల TFT డిజిటల్ కన్సోల్ ను తీసుకొచ్చింది.  ఇందులో స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్స్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, RC లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను డిజిటల్‌గా సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

మైలేజీ పెంచే టెక్నాలజీ

కొత్త బైక్‌లో సైలెంట్ స్టార్టర్‌తో కూడిన స్విచ్చబుల్ ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌ను కూడా అందించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆపడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో  సాయపడుతుంది. రోజువారీ ప్రయాణాల్లో మైలేజీ పెరిగే అవకాశం ఉంది. USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ లైట్లు లాంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

ధర ఎంత ఉండొచ్చు?

కొత్త పల్సర్ 125 ధర ప్రస్తుతం సుమారు రూ.1.13 లక్షల ఆన్ రోడ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బజాజ్ ఇంకా అధికారికంగా బైక్‌ను విడుదల చేయలేదు కాబట్టి, ధర, వేరియంట్లు, పూర్తి స్పెసిఫికేషన్లు వెల్లడికావాల్సి ఉంది.

Read Also: కొత్త లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650.. ఏమేం మారాయంటే?

Tags

Related News

మారుతి కార్ల ధరలు పెంపు, ఆ మోడల్ పై ఏకంగా రూ. 30 వేలు జంప్!

టన్నెల్ లో తలకిందులుగా దూసుకెళ్లిన చైనీస్ ఈవీ.. మెర్సిడెస్ స్టంట్‌ ను గుర్తు చేసిన వోయా!

ఈ కారు ధర అక్షరాలా రూ. 382 కోట్లు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

పిల్లల కోసం మహీంద్రా BE 6 బేబీ ఎడిషన్.. బుల్లి ఎలక్ట్రిక్ కారు భలే ఉందిగా!

మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్ vs టయోటా హిలక్స్.. ఏ పికప్ బెస్ట్?

కొత్త లుక్ లో నార్టన్ మ్యాంక్స్ ఆర్‌.. పింక్, పర్పుల్ లో అదిరిందయ్యా!

కొత్త లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650.. ఏమేం మారాయంటే?

Big Stories

Advertisement
×