E-Paper
Advertisement

హోండా నుంచి 3 కొత్త కార్లు.. ఏ మోడళ్లు వస్తున్నాయో తెలుసా?

హోండా నుంచి 3 కొత్త కార్లు.. ఏ మోడళ్లు వస్తున్నాయో తెలుసా?
Advertisement

Honda India’s Upcoming Cars: హోండా కార్స్ ఇండియా రాబోయే రోజుల్లో భారత మార్కెట్‌ లో వరుసగా కొత్త మోడళ్లను తీసుకురావడానికి రెడీ అవుతోంది. గత కొంతకాలంగా కొత్త కార్ల విషయంలో కాస్త స్లోగా కనిపించిన కంపెనీ, ఇప్పుడు తన కార్ల శ్రేణిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో అప్‌ డేటెడ్ హోండా ఎలివేట్, తొలి ఎలక్ట్రిక్ SUV, అలాగే ఐకానిక్ హోండా ప్రిల్యూడ్ లాంటి మూడు ముఖ్యమైన మోడళ్లు ఉన్నాయి.

1.హోండా ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్

హోండా ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్ 2026 సెకెండాఫ్ లో అప్‌ డేట్ వచ్చే అవకాశం ఉంది. డిజైన్‌ లో పెద్దగా మార్పులు లేకపోయినా, ముందు భాగంలో కొత్త గ్రిల్, బంపర్, హెడ్‌ ల్యాంప్ డిజైన్, అలాగే వెనుక భాగంలో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఇంటీరియర్‌ లో కూడా కొత్త ఫీచర్లు, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించే అవకాశముంది. ప్రస్తుతం యాక్సెసరీలుగా మాత్రమే అందిస్తున్న 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లను ఈసారి ఫ్యాక్టరీ నుంచే అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంజిన్ పరంగా మాత్రం ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 121 PS పవర్, 145 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌ బాక్స్ ఆప్షన్స్ ఉండొచ్చు. అలాగే, హైబ్రిడ్ వెర్షన్‌ ను కూడా హోండా తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది.

2.0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV

Advertisement

హోండా నుంచి రాబోయే మరో కీలక మోడల్ 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV. భారత మార్కెట్ కోసం కంపెనీ తీసుకొస్తున్న తొలి పూర్తి ఎలక్ట్రిక్ SUV కానుంది. ఇప్పటికే ఈ మోడల్ భారత రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనిని భారత్‌ లోనే తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యంపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడించకపోయినా, ఇందులో 50 నుంచి 70 kWh మధ్య బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ప్రారంభంలో ఫ్రంట్ వీల్ డ్రైవ్ వేరియంట్‌ ను, తర్వాత ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్‌ను కూడా తీసుకురావచ్చని భావిస్తున్నారు. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE 6, మారుతి e Vitara లాంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది.

3.హోండా ప్రిల్యూడ్

మూడో మోడల్ హోండా ప్రిల్యూడ్. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా దిగుమతి చేసుకునే మోడల్‌ గా అమ్మకానికి తీసుకురావచ్చని తెలుస్తోంది. 2026 చివరలో లేదంటే 2027లో ఈ కారు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.  ఈ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు టూ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం కలిపి సుమారు 200 హార్స్‌ పవర్ శక్తి, 315 Nm టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. సాంప్రదాయ గేర్‌ బాక్స్‌ కు బదులుగా హోండా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన S+ Shift టెక్నాలజీని ఇందులో ఉపయోగించనుంది. స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని అందించేలా దీనిని రూపొందిస్తున్నారు.

Advertisement

Read Also: జూలైలో టాటా అమ్మకాల జోరు.. వామ్మో.. ఒక్క నెలలో అన్ని కార్లు అమ్మిందా?

Related News

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

దీపావళి సీజన్‌లో కొత్త కార్ల జాతర.. మారుతి, హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త మోడళ్లు ఇవే!

హీరో నుంచి కొత్త బైక్.. క్యూరియాసిటీ పెంచుతున్న లేటెస్ట్ స్పై షాట్స్!

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×