Maruti Swift and Dzire CNG AMT: CNG కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మారుతి సుజుకి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు CNGతో పాటు మాన్యువల్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉన్న కొన్ని మోడళ్లకు ఇప్పుడు AMT ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్విఫ్ట్, డిజైర్ CNG AMT వెర్షన్లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి.
మారుతి డిజైర్ CNG AMT ప్రారంభ ధర రూ.8.53 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ వెర్షన్‌ను VXi, ZXi అనే రెండు ట్రిమ్‌లలో అందిస్తోంది. డిజైర్‌లో 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. CNGపై నడిచేటప్పుడు 70hp పవర్, 101Nm టార్క్‌ను ఉత్పత్తి అవుతుంది. దీనికి 5-స్పీడ్ AMT గేర్ బాక్స్ యాడ్ చేశారు. మాన్యువల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
డిజైర్ CNG AMTలో మైలేజ్ ఆకట్టుకుంటుంది. ARAI ప్రకారం కిలో CNGకి 36.47 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అదే మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ 33.73 కి.మీ మైలేజ్ అందిస్తుంది. CNG ట్యాంక్ సామర్థ్యం 55 లీటర్లు ఉంటుంది. బూట్ లో CNG ట్యాంక్ ఏర్పాటు చేసినప్పటికీ, కారు మొత్తం ప్రాక్టికాలిటీని కొనసాగించేలా మారుతి ఈ వెర్షన్ ను రూపొందించింది.
డిజైర్ CNG AMTలో 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్ ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, TPMS లాంటి ఫీచర్లు ఉన్నాయి. వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేసే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది.
అటు స్విఫ్ట్ CNG AMT ప్రారంభ ధర రూ.7.92 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ వెర్షన్ VXi, VXi (O), ZXi అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీంతో స్విఫ్ట్ కొనుగోలుదారులకు CNGతో పాటు ఆటోమేటెడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
స్విఫ్ట్ లో కూడా 1.2 లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. CNG మోడ్‌లో ఇది 70hp పవర్, 102Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్‌లో 83hp పవర్, 112.4Nm టార్క్ అందిస్తుంది. AMT వెర్షన్ ARAI ప్రకారం కిలో CNGకి 35.34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మాన్యువల్ వెర్షన్ 32.85 కి.మీ మైలేజ్ అందిస్తుంది.
స్విఫ్ట్ CNG AMTలో 15 అంగుళాల వీల్స్, ఎత్తు సర్దుబాటు చేసుకునే డ్రైవర్ సీటు, ఆరు స్పీకర్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వెనుక వైపర్, ఆటోమేటిక్ AC, సర్దుబాటు చేసుకునే హెడ్ రెస్ట్ లు కూడా లభిస్తాయి. ఇందులోనూ 55 లీటర్ల CNG ట్యాంక్‌ను బూట్ లో ఏర్పాటు చేశారు.
Read Also: మైలేజీకి మారుతి కొత్త ప్లాన్.. బాలెనో CNG-AMT వచ్చేసింది!