E-Paper
Advertisement

ఎంజీ హెక్టర్ హాక్ వచ్చేస్తోంది.. PHEV, ఎలక్ట్రిక్ వెర్షన్లతో అదిరిపోయే ఎంట్రీ!

ఎంజీ హెక్టర్ హాక్ వచ్చేస్తోంది.. PHEV, ఎలక్ట్రిక్ వెర్షన్లతో అదిరిపోయే ఎంట్రీ!
Advertisement

MG Hector HecK Launch: ఎంజీ మోటార్ ఇండియా కొత్త SUVని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది.  ఎంజీ హెక్టర్ హాక్ పేరుతో వస్తున్న ఈ SUVని ఆగస్టు 26న విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత హెక్టర్‌ తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌ లో కీలక మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ఇంజన్‌ తో పాటు ఎలక్ట్రిక్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

వులింగ్ స్టార్‌ లైట్ 560 ఆధారంగా తయారీ

హెక్టర్ హాక్‌ను వులింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంజీ కొత్త ADAPT ఆర్కిటెక్చర్‌ పై రూపొందనుంది. మొదటి నుంచి ఎలక్ట్రిఫైడ్ పవర్‌ ట్రెయిన్లను దృష్టిలో పెట్టుకుని ఈ SUVని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లో ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్, పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్ల లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఈ SUV ఐదు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తోంది. భారత్‌లో ఏ సీటింగ్ కాన్ఫిగరేషన్‌ ను తీసుకొస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

PHEV వెర్షన్ లో హెక్టర్ హాక్‌

Advertisement

హెక్టర్ హాక్‌లో PHEV వెర్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. గ్లోబల్ మోడల్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, 20.5kWh బ్యాటరీ ఉంటాయి. ఈ సెటప్ సుమారు 194bhp పవర్, 230Nm టార్క్‌ ను అందిస్తుంది. తాజా పరీక్షల్లో ఎలక్ట్రిక్ మోడ్‌లో సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని, మొత్తం రేంజ్ దాదాపు 1,100 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అయితే, ఇండియా స్పెక్ మోడల్ వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

సింగిల్ ఛార్జ్ తో 500 కిలోమీటర్ల రేంజ్

ఎలక్ట్రిక్ వెర్షన్ విషయానికి వస్తే, గ్లోబల్ స్టార్‌లైట్ 560 EVలో 56.7kWh బ్యాటరీ, ముందు భాగంలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. ఇది సుమారు 136bhp పవర్, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తాజా పరీక్షల ప్రకారం దీని రేంజ్ 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భారత వెర్షన్‌ లో ఇదే బ్యాటరీ, రేంజ్ ఉంటాయా? మార్పులు చేస్తారా? అనేది విడుదల సమయంలో వెల్లడికానున్నాయి.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల పరంగా కూడా హెక్టర్ హాక్ అత్యాధునికంగా ఉండనుంది. పెద్ద టచ్‌ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, పనోరమిక్ సన్‌ రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, ADAS, వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, భారతీయ మోడల్‌లో లభించే బ్యాటరీ సామర్థ్యం లాంటి వివరాలను ఎంజీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. PHEV విభాగంలో పోటీ తక్కువగా ఉండటంతో హెక్టర్ హాక్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోనుంది. మరోవైపు ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా XEV 9S వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది.

Tags

Related News

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

కారుపై కనిపించే చిన్న ఫిన్.. దీని ఉపయోగాలేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

Big Stories

Advertisement
×