E-Paper
Advertisement

బబుల్ కార్ మైక్రోలినో.. ఈ బుల్లి ఎలక్ట్రిక్ కార్ ఎంత క్యూట్ గా ఉందో!

బబుల్ కార్ మైక్రోలినో.. ఈ బుల్లి ఎలక్ట్రిక్ కార్ ఎంత క్యూట్ గా ఉందో!
Advertisement

Stylish Urban Electric Microcar Microlino: చూడ్డానికి ముద్దుగా ఉండే కారు. ఒకే ఛార్జ్ తో ఏకంగా 200 కి.మీ ప్రయాణం చేసే అవకాశం. రోడ్డు మీద వెళ్తుంటే బబుల్ మాదిరిగా ఆకట్టుకునే ఎలక్ట్రిక్ మైక్రో కారు మైక్రోలినో. తక్కువ దూరాల ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన  ఈ కారును.. ఇటలీలో తయారు చేశారు. ఒకప్పుడు పాపులర్ మోడల్ అయిన ఐసెట్టా బబుల్ కార్ డిజైన్‌ ను లేటెస్ట్ టెక్నాలజీతో కలిపి తయారు చేశారు. దీని రెట్రో లుక్ చూసిన వెంటనే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ముందువైపు ఓపెన్ అయ్యే డోర్ దీని ప్రత్యేకత. ఈ డోర్ ద్వారా డ్రైవర్, ప్రయాణికుడు నేరుగా లోపలికి వెళ్లొచ్చు. దీని ధర భారతీయ కరెన్సీలో సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుంది.

ఇద్దరు కూర్చునే వెసులుబాటు

మైక్రోలినో కారులో ఇద్దరు మాత్రమే కూర్చునే సదుపాయం ఉంది. చిన్నదిగా ఉన్నప్పటికీ, 230 లీటర్ల వరకు బూట్ స్పేస్ ఉంటుంది. ఈ కారు గరిష్టంగా సుమారు 90 కిలోమీటర్ల వేగాన్ని పొందుతుంది. సిటీల్లో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది.  బ్యాటరీ విషయానికి వస్తే, మైక్రోలినోలో వేర్వేరు సామర్థ్యాల బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. చిన్న బ్యాటరీతో తక్కువ రేంజ్, పెద్ద బ్యాటరీతో ఎక్కువ రేంజ్ అందిస్తుంది. పూర్తి ఛార్జ్‌ పై సుమారు 90 నుంచి 200 కిలోమీటర్ల మధ్య ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ కూడా ఈజీ. ఇంట్లో సాకెట్, టైప్-2 ఛార్జర్ ద్వారా 2 నుంచి 5.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఆకట్టుకునే డిజైన్

Advertisement

ఈ కారు చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంటుంది. దాదాపు 2.5 మీటర్ల పొడవుతో, చాలా తక్కువ వెడల్పుతో ఉంటుంది.  నగరాల్లో ఇరుకైన ప్రదేశాల్లో కూడా సులభంగా పార్క్ చేసుకోవచ్చు. కేవలం స్థలం మాత్రమే కాకుండా, ట్రాఫిక్‌లో డ్రైవింగ్ కూడా ఈజీగా ఉంటుంది. స్టీల్, అల్యూమినియంతో తయారైన యూనిబాడీ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. పాత బబుల్ కార్లతో పోలిస్తే మరింత సేఫ్ గా ఉంటుంది. ఛార్జింగ్ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.

Read Also: ఫస్ట్ ఇండియన్ సోలార్ ఎలక్ట్రిక్ కారు.. వావ్.. వైవ్ ఈవా ఎంత బాగుందో!

హైవే ప్రయాణాలకు అనుకూలం కాదు!

Advertisement

ఈ బుల్లికారు హైవే ప్రయాణాలకు అనుకూలంగా ఉండదు. రైడ్ కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా పరిమితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రధానంగా నగర ప్రయాణాలకే ఉపయోగించడం మంచిది. మొత్తానికి, మైక్రోలినో కారు  భవిష్యత్తులో పట్టణ రవాణాలో కొత్త ట్రెండ్‌ను సృష్టించే వెహికల్ కాబోతోంది. అయితే, చిన్నదైనా, వినియోగానికి సరిపోయే విధంగా రూపొందించబడిన ఈ ఎలక్ట్రిక్ కారు, ప్రత్యేకమైన డిజైన్, తక్కువ ఖర్చుతో సిటీలో మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఫీచర్లలో విన్‌ఫాస్ట్ VF3 సూపర్.. కానీ, ఇండియాలో హిట్ కొట్టేనా?

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×