E-Paper
Advertisement

పల్సర్‌కు మళ్లీ పాత జోష్ వస్తుందా? కొత్త 125, 150తో బజాజ్ మాస్టర్ ప్లాన్!

పల్సర్‌కు మళ్లీ పాత జోష్ వస్తుందా? కొత్త 125, 150తో బజాజ్ మాస్టర్ ప్లాన్!
Advertisement

New Bajaj Pulsar 125 and 150: ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌ లో ఒకప్పుడు పల్సర్ అంటే బజాజ్‌కు మరో పేరు. యువతలో స్పోర్టీ బైక్‌లకు క్రేజ్ పెంచిన ఈ బ్రాండ్‌కు ఇప్పుడు అదే స్థాయిలో పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా 125cc, 150cc విభాగాల్లో ప్రత్యర్థి కంపెనీలు కొత్త మోడళ్లతో దూసుకెళ్తుండటంతో బజాజ్ తన ప్లాన్ మార్చుకుంటోంది. ఇందులో భాగంగా పల్సర్ 125, పల్సర్ 150లకు పూర్తి స్థాయి అప్‌డేట్ ఇచ్చింది.

పాత లుక్ అయినా కీలక మార్పులు

కొత్త మోడళ్లలో పల్సర్‌ కు ఉన్న క్లాసిక్ డిజైన్ గుర్తింపును బజాజ్ కొనసాగించింది. అయితే, బైక్‌లోని అంతర్గత భాగాల్లో మాత్రం భారీ మార్పులు చేసినట్లు కంపెనీ చెబుతోంది. అంటే, బయటికి చూస్తే పాత పల్సర్ ఫీల్ కనిపించినా, రైడింగ్ ఎక్స్ పీరియెన్స్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా న్యూ జెనరేషన్ మార్పులను తీసుకురానుంది. ఈ రెండు మోడళ్ల ద్వారా గతంలో పల్సర్‌కు ఉన్న బలమైన కస్టమర్ బేస్‌ను మళ్లీ పొందే ప్రయత్నం చేస్తోంది.

పల్సర్ 125కు పెరుగుతున్న పోటీ!

Advertisement

125cc విభాగం దేశంలో అత్యంత పెద్ద బైక్ మార్కెట్లలో ఒకటి. ఇక్కడ హోండా బలమైన స్థానంలో ఉంది. ఏప్రిల్-ఆగస్టు 2026 కాలంలో హోండా 17.79 లక్షల యూనిట్ల అమ్మకాలతో దాదాపు 49 శాతం వాటాను సాధించింది. బజాజ్ 7.93 లక్షల యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా, హీరో 6.17 లక్షలు, టీవీఎస్ 4.27 లక్షల యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, పల్సర్ 125 అమ్మకాలు సుమారు 3 శాతం తగ్గడం బజాజ్‌కు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు TVS Raider లాంటి స్పోర్టీ 125cc బైక్‌ల అమ్మకాలు పెరుగుతున్నాయి. హీరో Xtreme 125R, హోండా CB125 Hornet వంటి మోడళ్లు కూడా ఈ సెగ్మెంట్ లో పోటీని మరింత పెంచుతున్నాయి.

మరింత పవర్ తో పల్సర్ 150

పల్సర్ 150 పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు 150cc బైక్‌లకు ప్రత్యేకమైన స్టైలింగ్, పనితీరు ఇప్పుడు 125cc స్పోర్టీ మోడళ్లలోనే కనిపిస్తోంది. అదే సమయంలో 160cc బైక్‌లు కొద్దిగా ఎక్కువ ధరకు మరింత పవర్ ను అందిస్తున్నాయి. ఏప్రిల్-ఆగస్టు 2026లో 125-150cc సెగ్మెంట్ దేశీయ అమ్మకాలు 49.5 శాతం పెరిగాయి. కానీ, అదే సమయంలో బజాజ్ అమ్మకాలు 34 శాతం తగ్గాయి. దీంతో ఈ విభాగంలో కంపెనీ వాటా సుమారు 42 శాతం నుంచి 18 శాతానికి పడిపోయింది. 2022లో P150, 2023లో N150 ద్వారా కొత్త దారిలో వెళ్లేందుకు బజాజ్ ప్రయత్నించింది. అయితే ఆ మోడళ్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఇప్పుడు సంస్థ మరో వ్యూహాన్ని ఎంచుకుంది. పల్సర్ 150 పేరును, దాని గుర్తింపును మార్చకుండా బైక్‌ను లోపల నుంచి మెరుగుపరచడం ప్రారంభించింది. అయితే, పల్సర్ 150కు మరోవైపు 125cc స్పోర్టీ బైక్‌లు, మరోవైపు 160cc మోడళ్లు సవాలుగా మారాయి. అయితే, దేశీయ బైక్ మార్కెట్‌లో కోల్పోతున్న వాటాను బజాజ్ తిరిగి సాధించేలా ఈ బైక్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Read Also: బజాజ్ పల్సర్ లో అదిరిపోయే అప్‌డేట్.. TFT స్క్రీన్‌తో కొత్త లుక్!

Tags

Related News

259 కిమీ రేంజ్‌ తో నిస్సాన్ కొత్త EV.. చిన్న కారులో అదిరిపోయే ఫీచర్లు!

కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

టాటా To మహీంద్రా.. బ్లైండ్ స్పాట్ ఫీచర్ ఉన్న కార్ల లిస్ట్ ఇదే!

టాటా నంబర్ వన్.. మహీంద్రా నెక్స్ట్.. విన్‌ఫాస్ట్ స్పీడ్ చూస్తే షాక్!

రిలీజ్ కు ముందే టాటా ఏరిస్ వీడియో లీక్.. CNG మోడల్‌ లో ఇవే హైలైట్స్!

బజాజ్ పల్సర్ లో అదిరిపోయే అప్‌డేట్.. TFT స్క్రీన్‌తో కొత్త లుక్!

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

Big Stories

Advertisement
×