E-Paper
Advertisement

కొత్త లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650.. ఏమేం మారాయంటే?

కొత్త లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650.. ఏమేం మారాయంటే?
Advertisement

New Royal Enfield Continental GT 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన స్పోర్ట్స్ బైక్ కాంటినెంటల్ GT 650ను తాజాగా అప్‌డేట్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో డిజైన్, ఫీచర్లకు కొన్ని మార్పులు చేశారు. అయితే ఇంజిన్, గేర్‌ బాక్స్ లాంటి మెకానికల్ అంశాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త కాంటినెంటల్ GT 650 ధరలు రూ.3.58 లక్షల నుంచి రూ.3.88 లక్షల వరకు ఉన్నాయి.

నాలుగు వేరియంట్లలో విడుదల

కొత్త కాంటినెంటల్ GT 650ను నాలుగు కలర్, ట్రిమ్ ఆప్షన్లలో తీసుకొచ్చారు. ఇందులో రాకర్ రెడ్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, అపెక్స్ గ్రే, మిస్టర్ క్లీన్ ఉన్నాయి. రాకర్ రెడ్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ వేరియంట్ల ధర రూ.3.58 లక్షలు. అపెక్స్ గ్రే ధర రూ.3.81 లక్షలు కాగా, టాప్ వేరియంట్ మిస్టర్ క్లీన్ ధర రూ.3.88 లక్షలుగా ఉంది.  రాకర్ రెడ్ వేరియంట్‌ లో ప్రత్యేకంగా కొన్ని మార్పులు చేశారు. ఇందులో ఇంజిన్, ఎగ్జాస్ట్, కాస్ట్ అల్లాయ్ వీల్స్‌ను బ్లాక్ కలర్‌లో అందించారు. దీంతో బైక్‌కు మరింత స్పోర్టీ లుక్ వచ్చింది. ఇదే బ్లాక్ అవుట్ థీమ్ గతంలో అపెక్స్ గ్రే వేరియంట్‌కు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు రాకర్ రెడ్‌ లో కూడా ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చారు.

కొత్త ఫీచర్లు

Advertisement

కొత్త కాంటినెంటల్ GT 650లో అన్ని వేరియంట్లకు LED ఇండికేటర్లను అందించారు. అలాగే USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌ ను కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా చేర్చారు. ఇన్‌స్ట్రుమెంట్ కౌల్‌కు బ్లాక్ పెయింట్ ఇవ్వడం ద్వారా ముందు భాగానికి కొత్త లుక్ తీసుకొచ్చారు. ఈ మార్పులు పెద్దగా కనిపించకపోయినా బైక్ మొత్తం లుక్‌లో రీఫ్రెష్ గా కనిపిస్తుంది.

ఇంజిన్‌లో నో ఛేంజెస్   

కొత్త అప్‌డేట్ ఉన్నప్పటికీ కాంటినెంటల్ GT 650లోని మెకానికల్ ప్యాకేజీ మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇందులో 648cc ఎయిర్, ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 47hp గరిష్ట శక్తిని, 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు. పనితీరు విషయంలో కొత్త వెర్షన్‌కు పాత మోడల్‌తో పెద్దగా తేడా ఉండదు.

ధరలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

రాయల్ ఎన్‌ ఫీల్డ్ కాంటినెంటల్ GT 650లో రాకర్ రెడ్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ వేరియంట్లు రూ.3.58 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. అపెక్స్ గ్రే ధర రూ.3.81 లక్షలు కాగా, మిస్టర్ క్లీన్ ధర రూ.3.88 లక్షలు. కాగా కాంటినెంటల్ GT 650 ఇప్పటికే రెట్రో స్పోర్ట్స్ బైక్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: మహీంద్రా BE 6 స్పోర్టెక్ విడుదల.. ఫీచర్లు, రేంజ్ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!

టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

రెనాల్ట్ ట్రైబర్ టర్బో మైలేజ్ రివీల్.. లీటర్ పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే?

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

Big Stories

Advertisement
×