E-Paper
Advertisement

30 పెళ్లి సంబంధాలు ఫెయిల్.. 31వ పెళ్లి కూడా పెటాకులు… ఈ అమ్మాయి చేసిన పనికి హ్యాట్సాఫ్

30 పెళ్లి సంబంధాలు ఫెయిల్.. 31వ పెళ్లి కూడా పెటాకులు… ఈ అమ్మాయి చేసిన పనికి హ్యాట్సాఫ్
Advertisement

Malayalam Comedy Drama on OTT: పెళ్లి కోసం ఏకంగా 30 సంబంధాలు ఫెయిల్… 31వ సంబంధం మాత్రం పక్కాగా కుదిరింది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి కావడంతో ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కానీ పెళ్లికి ఒక్కరోజు ముందు వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో ఆ అమ్మాయి జీవితమే తలకిందులైతే ? పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి మరో అమ్మాయితో వెళ్లిపోయాడని తెలిసిన తర్వాత ఆమె ఏం చేసింది ? అందరూ బాధపడుతున్న సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి ? ఇదే ఆసక్తికరమైన కథతో వచ్చిన మలయాళ కామెడీ డ్రామా ‘అర్చన 31 నాట్ అవుట్’ (Archana 31 Not Out). మరి ఈ సినిమా కథేంటి ? చివర్లో అర్చన తీసుకునే నిర్ణయం ఏంటి ? తెలుగులో ఎక్కడ చూడొచ్చు ? ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

అర్చన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. 28 ఏళ్ల వయసున్న ఆమె కుటుంబానికి అండగా నిలుస్తుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రి, తల్లి, చెల్లెలితో కలిసి జీవిస్తుంది. అయితే పెళ్లి వయసు దాటిపోతుందనే ఆలోచనతో కుటుంబ సభ్యులు ఆమెకు సంబంధాలు చూడటం మొదలుపెడతారు. కానీ ఒక్క సంబంధం కూడా వర్కౌట్ కాదు. ఒక్కో కారణంతో ఏకంగా 30 సంబంధాలు ఫెయిల్ అవుతాయి. ఈ వైఫల్యాలను అర్చన ఓ క్యాలెండర్‌లో గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. చివరకు 31వ సంబంధం వస్తుంది. ఈసారి ప్రసాద్ అనే గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్న ఎన్ఆర్ఐతో పెళ్లి కుదురుతుంది. ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి.

Advertisement

ఇన్నాళ్ల తర్వాత తన జీవితం సెటిల్ అవుతుందని అర్చన కూడా సంతోషిస్తుంది. కానీ పెళ్లికి ఒక్కరోజు ముందు ఊహించని ఫోన్ కాల్ వస్తుంది. ప్రసాద్ మరో అమ్మాయితో వెళ్లిపోయాడని అర్చనకు తెలుస్తుంది. పెళ్లి కొడుకే కనిపించకుండా పోవడంతో కుటుంబం మొత్తం షాక్ అవుతుంది. అయితే ఇక్కడే అర్చన మిగతా వాళ్లకంటే విచిత్రంగా స్పందిస్తుంది. జరిగిన మోసానికి కుంగిపోకుండా, అసలు విషయం అందరికీ చెబుతుంది. పెళ్లి కోసం తన జీవితాన్ని ఆపేసుకోవాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటుంది.

తనను మోసం చేసిన వ్యక్తి కోసం బాధపడటం కంటే, తన జీవితంపై నిర్ణయం తానే తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇలా 30 సంబంధాల తర్వాత 31వ పెళ్లి కూడా విఫలమైనా, అర్చన మాత్రం ఓడిపోదు. సమాజం కోసం పెళ్లి చేసుకోవాలా ? లేక తనకు నచ్చిన జీవితాన్ని తానే ఎంచుకోవాలా ? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చే సమాధానమే సినిమాలో హైలైట్. మరి క్లైమాక్స్ లో ఏం జరిగిందో తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులోనూ అందుబాటులో

Advertisement

ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అఖిల్ అనిల్‌కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ‘అర్చన 31 నాట్ అవుట్’ తెలుగు వెర్షన్ ETV Winలో అందుబాటులో ఉంది. ఈ ఓటీటీలో మలయాళం సినిమా ‘అర్చన 31 నాట్ అవుట్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. Airtel Xstream Playలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. పెళ్లి ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు, మహిళ స్వతంత్ర నిర్ణయం, లైట్ కామెడీతో పాటు మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.

Read Also: శవాలను మాయం చేసే బిజినెస్… ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

Tags

Related News

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×