E-Paper
Advertisement

మహీంద్రా BE 6 స్పోర్టెక్ విడుదల.. ఫీచర్లు, రేంజ్ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా BE 6 స్పోర్టెక్ విడుదల.. ఫీచర్లు, రేంజ్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Mahindra BE 6 Sportech Launch: మహీంద్రా ఎలక్ట్రిక్ SUV BE 6కి కొత్త అప్‌డేట్ ఇచ్చింది. BE 6 స్పోర్టెక్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.19.45 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. కొత్త వేరియంట్లు, 70kWh బ్యాటరీ, మరిన్నిఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. ఈ కారు డెలివరీలు ఆగస్టు 26 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఏ వేరియంట్ ధర ఎంత అంటే?

BE 6 స్పోర్టెక్ ధరలు వేరియంట్‌ ను బట్టి మారుతాయి. 59kWh బ్యాటరీతో వచ్చే వన్ వేరియంట్ ధర రూ.19.45 లక్షలు కాగా, టూ వేరియంట్ ధర రూ.20.95 లక్షలు. 70kWh బ్యాటరీతో వచ్చే త్రీ వేరియంట్ ధర రూ.22.95 లక్షలు. త్రీ+ వేరియంట్ రూ.23.95 లక్షలకు లభిస్తుంది.  79kWh బ్యాటరీ కలిగిన ఫోర్ వేరియంట్ ధర రూ.26.95 లక్షలు. లాంచ్ ఎడిషన్, ఫార్ములా E ఎడిషన్ లాంటి ప్రత్యేక వేరియంట్లు కూడా లైనప్‌ లో ఉన్నాయి.

BaaSతో తక్కువ ధరలో అందుబాటులో!

Advertisement

మహీంద్రా ఈసారి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) విధానాన్ని కూడా తీసుకొచ్చింది. ఇది 59kWh బ్యాటరీతో వచ్చే వన్, టూ వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విధానంలో కారు ధరను విడిగా చెల్లించి, బ్యాటరీ కోసం కిలోమీటరుకు రూ.3.75 సబ్‌స్క్రిప్షన్ ఛార్జీ చెల్లించాలి. రోజుకు సుమారు 60 కిలోమీటర్ల వినియోగం, ఎనిమిదేళ్ల కాలానికి ఈ ధరను నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

న్యూ లుక్, స్పెషల్ ఎడిషన్స్

బయటివైపు BE 6 స్పోర్టెక్ పాత BE 6 డిజైన్‌ను చాలా వరకు అలాగే కొనసాగిస్తుంది. కొత్త స్పోర్టెక్ బ్యాడ్జింగ్, ప్రత్యేక లాంచ్ ఎడిషన్ ఇందులో కీలక మార్పులుగా తీసుకొచ్చింది. లాంచ్ ఎడిషన్ గ్రాఫైట్ స్టార్మ్ కలర్‌లో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

ట్రిపుల్ స్క్రీన్ ఇంటీరియర్

Advertisement

క్యాబిన్‌లో మాత్రం చాలా మార్పులు చేశారు. టాప్ వేరియంట్లలో మూడు 12.3 అంగుళాల స్క్రీన్‌లతో కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. పాత హాలో తరహా డిజైన్‌ను తొలగించి మరింత సింపుల్‌గా కనిపించే హారిజాంటల్ డిజైన్‌ను తీసుకొచ్చారు.దీంతో స్టోరేజ్ స్పేస్ పెరగడంతో పాటు వైర్‌ లెస్ ఛార్జింగ్ ప్యాడ్, USB టైప్-C పోర్టులను సులభంగా ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిన తర్వాత సమీప ఛార్జింగ్ స్టేషన్ వరకు వెళ్లేందుకు 13 కిలోమీటర్ల వరకు అదనపు రేంజ్ అందిస్తుందని మహీంద్రా వెల్లడించింది.

మూడు బ్యాటరీ ఆప్షన్లు

BE 6 స్పోర్టెక్ 59kWh, 70kWh, 79kWh బ్యాటరీలతో లభిస్తుంది. వీటి పవర్ అవుట్‌పుట్ వరుసగా 231hp, 245hp, 286hpగా ఉంటుంది. మూడు వెర్షన్లలోనూ 380Nm టార్క్ లభిస్తుంది. MIDC రేంజ్ వరుసగా 548 కిమీ, 651 కిమీ, 683 కిమీగా ఉంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా మూడు బ్యాటరీలను 20 నుంచి 80 శాతం వరకు సుమారు 20 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.

Read Also: రూ.20 లక్షల్లోపే మహీంద్రా కొత్త పికప్.. స్కార్పియో లైఫ్‌ స్టైలర్ ప్రత్యేకతలివే!

Tags

Related News

కొత్త లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650.. ఏమేం మారాయంటే?

భారత్‌లో కొత్త కార్ల హంగామా.. సెప్టెంబర్ నాటికి ఈ 6 కార్లు విడుదల!

రాయల్ ఎన్‌ ఫీల్డ్ హిమాలయన్ 440 లాంచ్ డేట్ ఫిక్స్, ధర రూ.2.50 లక్షలేనా?

రూ.20 లక్షల్లోపే మహీంద్రా కొత్త పికప్.. స్కార్పియో లైఫ్‌ స్టైలర్ ప్రత్యేకతలివే!

హ్యుందాయ్ ఈవీ To న్యూ నెక్సాన్.. 2027లో దుమ్మురేపనున్న కొత్త కాంపాక్ట్ SUVలు ఇవే!

స్కోడా స్లావియా ఫేస్‌ లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్, కొత్త మోడల్ ప్రత్యేకత ఏంటంటే?

326 కి.మీ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఇండియన్ మార్కెట్ లోకి విన్‌ఫాస్ట్ VF5 ఎంట్రీ!

Big Stories

Advertisement
×