E-Paper
Advertisement

Nissan Gravite: జస్ట్ రూ. 5.65 లక్షలకే నిస్సాన్ గ్రావైట్‌ కాంపాక్ట్.. మార్కెట్ లోకి లాంచ్ చేసిన కంపెనీ!

Nissan Gravite: జస్ట్ రూ. 5.65 లక్షలకే నిస్సాన్ గ్రావైట్‌ కాంపాక్ట్.. మార్కెట్ లోకి లాంచ్ చేసిన కంపెనీ!
Advertisement

ప్రముఖ ఆటో మోబైల్ కంపెనీ నిస్సాన్ గ్రావైట్ కాంపాక్ట్ MPVని భారతీయ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ లో భాగంగా తొలి 5,000 యూనిట్లను రూ. 5.65 లక్షలకు అందించాలని నిర్ణయించింది. ఇది రెనాల్ట్ ట్రైబర్ మాదిరిగానే CMF-A+ ప్లాట్‌ ఫామ్, టాప్ హ్యాట్‌ ను ఉపయోగిస్తుంది. కానీ, కాస్మెటిక్ వ్యత్యాల్సాలను కలిగి ఉంటుంది. గ్రావైట్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

నిస్సాన్ గ్రావైట్ కి మూడేళ్ల గ్యారెంటీ

నిస్సాన్ గ్రావైట్ ను 3 సంవత్సరాలు లేదంటే 1,00,000 కిమీ ప్రామాణిక వారంటీతో అందించనున్నట్లు వెల్లడించింది. ఈ సెగ్మెంట్ బెస్ట్ 10 సంవత్సరాలు లేదంటే 2,00,000 కిమీ వరకు పొడిగించబడుతుంది. మొదటి 5,000 బుకింగ్‌లకు మొదటి ఐదు సంవత్సరాల వరకు జీరో సర్వీస్ ఛార్జీలు, అలాగే ఫైనాన్సింగ్, అప్‌ గ్రేడ్ ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

నిస్సాన్ గ్రావైట్  డిజైన్

Advertisement

గ్రావైట్ కోసం ట్రైబర్ కు సంబంధించిన పలు మృదువైన భాగాలు  ఉపయోగించారు. గ్రావైట్ స్టైలింగ్ ఎక్కువగా ట్రైబర్‌ పై ఆధారపడి ఉంటుంది. అయితే, నిస్సాన్ MPV హెడ్‌లైట్లలో విభిన్న DRL సిగ్నేచర్లు, ప్రత్యేకమైన వీల్ డిజైన్లు, C-ఆకారపు సిల్వర్ ఇన్సర్ట్‌ లతో రీ డిజైన్ చేసిన బంపర్లు, బోనెట్, టెయిల్‌ గేట్‌పై ‘GRAVITE’ అక్షరాలు రాసి ఉన్నాయి.  గ్రావైట్ ఫారెస్ట్ గ్రీన్, ఒనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, స్నో వైట్, మెటాలిక్ గ్రే అనే విభిన్న రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. గ్రావైట్  పరిమిత రన్ లాంచ్ ఎడిషన్ (1,001 యూనిట్లు) కూడా ఉంది. ఇది C-ఆకారపు ఇన్సర్ట్‌లకు ఆరెంజ్, వైట్ టైర్ ప్రింట్ డెకాల్‌లను యాడ్ చేస్తుంది.

నిస్సాన్ గ్రావైట్ ఇంటీరియర్, ఫీచర్లు

గ్రావైట్ లే అవుట్, 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ నేపథ్యంలో ట్రైబర్‌ ను పోలి ఉంటుంది. అయితే కలర్ స్కీమ్, కొన్ని ట్రిమ్ లు ప్రత్యేకంగా ఉంటాయి. డాష్‌ బోర్డ్ దాని డిజైన్‌ లో సరళంగా ఉంటుంది. ఇందులో మూడు స్పోక్ ఫ్లాట్ బాటమ్డ్ స్టీరింగ్ వీల్, త్రయం క్లైమేట్ కంట్రోల్ నాబ్‌లు, చాలా బూట్ స్పేస్ ఉంటుంది. హై ట్రిమ్‌లలో, 8-అంగుళాల సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌ స్క్రీన్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉన్నాయి.

Advertisement

వైర్‌లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పుష్ బటన్ స్టార్ట్, స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ LED హెడ్‌ ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు, వెనుక AC వెంట్స్, పార్కింగ్ సెన్సార్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌ లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.గ్రావైట్ లాంచ్ ఎడిషన్‌లో అదనంగా JBL సౌండ్ సిస్టమ్, డ్యూయల్ ఛానల్ డాష్‌ క్యామ్, యాంబియంట్ లైటింగ్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటివి ఉన్నాయి.   .

నిస్సాన్ గ్రావైట్ ఇంజిన్, మైలేజ్   

గ్రావైట్ ట్రైబర్ 1.0-లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 72hp పవర్, 96Nm పవర్ ను అందిస్తుంది. దీనిని 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMTతో వస్తుంది. ఈ కారు 19.3-19.6 కి.మీ మైలేజీ అందిస్తుంది.

Read Also: వచ్చేసింది మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×