Basit Ali Cooked Pakistan Cricket Team: 2027 వన్డే వరల్డ్ కప్ సరిగ్గా ఏడాది తర్వాత జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీమిండియా అలాగే పాకిస్తాన్ జట్ల ప్రదర్శన పై బాసిత్ ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే ఆ టోర్నమెంట్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ అంటూ వ్యాఖ్యానించారు. వరల్డ్ కప్ కోసం ఇప్పటినుంచి టీమిండియా సాధన మొదలు పెట్టిందని… గౌతమ్ గంభీర్ నిద్ర లేకుండా పనిచేస్తున్నాడని ప్రశంసల వర్షం కురిపించారు. వరల్డ్ కప్ కోసం ఇప్పటికే 70% వర్క్ ఫినిష్ చేశాడని.. బౌలర్లను ఫైనల్ చేస్తే టీమిండియా బరిలో దిగడమే అంటూ కొనియాడారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికీ మొద్దు నిద్ర లేవలేదని సీరియస్ అయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయని.. అందరూ సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లతో వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని బాంబు పేల్చారు బాసిత్ ఆలీ.
2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకు వెళ్తుందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ఊపు చూస్తుంటే కచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశాలే కనిపిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా లాంటి బౌన్సీ మైదానంలో ఎలా ఆడాలి అనే దాని పైన ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించారని కొనియాడారు. అలాగే టీమిండియా కాంబినేషన్ పైన గౌతమ్ గంభీర్ చేస్తున్న కసరత్తులు, ప్రయోగాలు అన్నీ ఇన్ని కాదని తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం బలమైన టీం ఇండియన్ సిద్ధం చేయడమే లక్ష్యంగా గౌతమ్ గంభీర్ పనిచేస్తున్నాడని ప్రశంసించారు. దానికి తగ్గట్టుగానే టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు ఇంత మొద్దు నిద్ర లేవలేదని సీరియస్ అయ్యారు బాసిత్ అలీ. వరల్డ్ కప్ కోసం ఆడకుండా తమ సొంత స్వార్థం కోసం పాకిస్తాన్ ప్లేయర్లు క్రికెట్ ఆడతారని ఫైర్ అయ్యారు. సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తారని మండిపడ్డారు. అసలు 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతుందన్న విషయం వాళ్లకు తెలుసో? లేదో? అంటూ పరువు తీశారు. ఆ టోర్నమెంట్ గురించి పట్టించుకోకుండా తమకు నచ్చింది చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీని పైన దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంటులో గ్రూప్ స్టేజిలోనే పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు బాసిత్ అలీ.