Second Hand Cars In Hyderabad: చాలా మందికి కార్లు కొనాలనే ఆశ ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించవు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ సెకెండ హ్యాండ్ కార్లు. తక్కువ ధరలోనే మంచి యూజ్డ్ కార్లు లభిస్తున్నాయి. పలు వెబ్ సైట్లలో సెకెండ్ హ్యాండ్ క్లారకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ హైదరాబాద్ లో సెకెండ్ హ్యాండ్ కార్లు ఎక్కడ దొరుకుతాయి? ఏవి కొనుగోలు చేస్తే బాగుంటుంది? ధర ఎంత పెట్టాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హైదరాబాద్ లో బోలెడు సెకెండ్ హ్యాండ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సిటీ ప్రయాణాలకు అనుకూలమైన హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ SUVలు ఉన్నాయి. వీటిలో టాప్ మోడళ్లు అయిన హ్యుందాయ్ క్రెటా, మారుతి స్విఫ్ట్, హోండా సిటీ, మారుతి బాలెనో సహా పలు కార్లు ఉన్నాయ. ఈ ప్రీ ఓన్డ్ వాహనాల్లో పాత మోడళ్ల ధర సుమారు రూ. 35,000 నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ మోడల్స్ ధరలు రూ. 3 నుంచి రూ. 10 లక్షల పరిధిలో కనిపిస్తాయి. స్పిన్నీ, కార్24, కార్ దేఖో లాంటి ప్లాట్ ఫారమ్‌ల మంచి సెకెండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
⦿ ప్రసుతం హైదరాబాద్ లో మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ i10, మారుతి బాలెనో, రెనాల్ట్ క్విడ్, మారుతి వ్యాగన్ ఆర్ లాంటి హ్యాచ్ బ్యాక్ లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి.
⦿ SUVలు, కాంపాక్ట్ SUVల విషయానికి వస్తే, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా XUV300, XUV700, కియా సెల్టోస్, టాటా నెక్సాన్ లాంటి కార్లు ఉన్నాయి.
⦿ సెడాన్లలో హోండా సిటీ, మారుతి స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ వెర్నా కార్లు ఉన్నాయి.
⦿ రూ. 5 లక్షల లోపు మారుతి ఆల్టో 800, రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ ఇయాన్, మారుతి వ్యాగన్ ఆర్ కార్లు లభిస్తున్నాయి.
⦿ 5 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు హ్యుందాయ్ క్రెటా, మారుతి బాలెనో, మారుతి స్విఫ్ట్, హోండా సిటీ లాంటి కార్లు ఉన్నాయి.
⦿ రూ. 10 లక్షలకు పైగా ధర పలికే కార్లలో టయోటా ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా XUV700, హ్యుందాయ్ క్రెటా కొత్త మోడళ్లు ఉన్నాయి.
⦿ ఉప్పల్ లో మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, రెనాల్ట్ క్విడ్ ఎక్కువగా లభిస్తాయి.
⦿ కూకట్‌పల్లి, హైటెక్ సిటీలో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్ లాంటి SUVలు, సెడాన్లు లభిస్తాయి.
⦿ ఎల్బీనగర్, బేగంబజార్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాచ్ బ్యాక్‌లు, సెడాన్లు లభిస్తాయి. లకు ప్రసిద్ధి.
సెకెండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్పిన్నీ, కార్24, కార్ దేఖో లాంటి ప్లాట్ ఫారమ్ లలో చాలా మంది డీలర్లు వారంటీలతో సర్టిఫైడ్, ముందస్తు చెకింగ్ చేయబడిన కార్లను అందిస్తారు.
Read Also: మాన్యువల్ కారును ఆటోమేటిక్‌గా మార్చుకోవచ్చు.. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా?