E-Paper
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ డబుల్ గేమ్.. ఒకవైపు ఈవీలు.. మరోవైపు పెట్రోల్ బైక్‌లు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ డబుల్ గేమ్.. ఒకవైపు ఈవీలు.. మరోవైపు పెట్రోల్ బైక్‌లు!
Advertisement

Royal Enfield Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్‌ తో తొలి ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకొచ్చినప్పటికీ, తమ ఫోకస్ ఎక్కువగా పెట్రోల్ మోటార్‌ సైకిళ్ల మీదే ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది.

‘రీ-బ్యాలెన్స్’ వ్యూహంతో ముందుకు

కంపెనీ రూపొందించిన  రీ-బ్యాలెన్స్ వ్యూహం ప్రకారం, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్ బైక్‌ల అభివృద్ధిపైనా సమానంగా దృష్టి పెట్టనుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు విభాగాల్లోనూ కొత్త ఉత్పత్తులను తీసుకురావడమే లక్ష్యంగా కంపెనీ పనిచేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నప్పటికీ, పెట్రోల్ మోటార్‌ సైకిళ్లలో పెట్టుబడులను కొనసాగిస్తామని ఐషర్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సిద్ధార్థ లాల్ వెల్లడించారు. మార్కెట్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, తమ సంప్రదాయ ఉత్పత్తులను కూడా మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

Advertisement

పెట్రోల్ బైక్‌లపై మాత్రమే ఆధారపడటం వల్ల భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని కంపెనీ అంగీకరించింది. అయితే, కొత్త ఉత్పత్తులు, బలమైన బ్రాండ్ ఇమేజ్, యువతను ఆకట్టుకునే డిజైన్లు, ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆ సవాళ్లను అధిగమించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

రెండు రకాల బైక్ లతో ముందుకు!

ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించిన ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్, ప్రస్తుతం ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ పెట్రోల్ బైక్‌లకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటికి అదనపు ఎంపికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే, భవిష్యత్తులో కూడా రెండు రకాల బైక్‌లను సమాంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉంచనుంది.

ఫ్లయింగ్ ఫ్లీ C6 గురించి..

Advertisement

ఈవీ బ్రాండ్‌ లో తొలి మోడల్‌గా ఫ్లయింగ్ ఫ్లీ C6ను ఇప్పటికే పరిచయం చేశారు. భారత మార్కెట్లో అధికారిక విడుదలకు ముందు బెంగళూరులో ప్రత్యేక షోరూమ్‌ను ప్రారంభించడంతో పాటు, పలు నగరాల్లో ఈ బైక్‌ను ప్రదర్శించారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.2.79 లక్షలుగా నిర్ణయించారు. అయితే  BaaS స్కీమ్ లో భాగంగా ప్రారంభ ధర రూ.1.99 లక్షలకు తగ్గనుంది.

అంతర్జాతీయ మార్కెట్ల పైనా ఫోకస్

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన విస్తరణను వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం బ్రెజిల్ కంపెనీకి అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న విదేశీ మార్కెట్‌గా నిలిచింది. బంగ్లాదేశ్, థాయ్‌ లాండ్‌లో కొత్త అసెంబ్లీ యూనిట్లను ఏర్పాటు చేసి, విదేశీ తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకవైపు ఎలక్ట్రిక్ బైక్‌లతో భవిష్యత్తు మార్కెట్‌కు సిద్ధమవుతూనే, మరోవైపు తనకు బలమైన గుర్తింపు తీసుకొచ్చిన పెట్రోల్ మోటార్‌సైకిళ్లపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి కొనసాగించాలని నిర్ణయించింది.

Read Also: ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో సంచలనం.. అవోర్ నుంచి ఒకేసారి ఏకంగా 3 కొత్త మోడళ్లు లాంచ్!

Related News

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

రెనాల్ట్ కార్లపై లక్షల్లో ఆఫర్లు.. డస్టర్‌పై ఏకంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

178 కి.మీ రేంజ్.. 75 కి.మీ స్పీడ్.. BGauss కొత్త స్కూటర్ ఏముంది భయ్యా!

అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!

Big Stories

Advertisement
×