E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో సంచలనం.. అవోర్ నుంచి ఒకేసారి ఏకంగా 3 కొత్త మోడళ్లు లాంచ్!

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో సంచలనం.. అవోర్ నుంచి ఒకేసారి ఏకంగా 3 కొత్త మోడళ్లు లాంచ్!
Advertisement

Avore EX1, EX2, EX2S Electric Bikes Launched: గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ స్టార్టప్ అవోర్.. భారత మార్కెట్లో  అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. ఒకేసారి EX1, EX2, EX2S పేర్లతో మూడు మోడళ్లను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ బైక్‌లకు ప్రీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కేవలం రూ.799 టోకెన్ చెల్లించి బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.  ఈ మూడు మోడళ్లు ఒకే డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, గరిష్ట వేగం, ఫీచర్లలో తేడాలు ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు వేర్వేరు వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఎంట్రీ లెవల్ మోడల్ EX1

ఎంట్రీ-లెవల్ మోడల్ EX1 ధర రూ.1.23 లక్షలు. ఇందులో 3.24kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బైక్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల IDC రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. అలాగే మూడు రైడింగ్ మోడ్‌లను కూడా ఇందులో అందించారు.

మిడ్ లెవల్ మోడల్ EX2

Advertisement

EX1 కంటే మెరుగైన వేరియంట్ EX2. ఇందులో 5kWh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 255 కిలోమీటర్ల IDC రేంజ్ అందుతుందని కంపెనీ చెబుతోంది. గరిష్ట వేగం మాత్రం గంటకు 100 కిలోమీటర్లుగానే ఉంటుంది. ఇందులో కూడా మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. సాధారణ 15A సాకెట్ ఉపయోగించి బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు సుమారు రెండు గంటల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్ ధర రూ.1.46 లక్షలు.

టాప్ వేరియంట్ EX2S

ఈ సిరీస్‌లో టాప్ వేరియంట్ EX2S. దీని ధర రూ.1.70 లక్షలు. ఇందులో కూడా 5kWh బ్యాటరీనే ఉన్నప్పటికీ, పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 114 కిలోమీటర్లు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 260 కిలోమీటర్ల IDC రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. EX2Sలో ఐదు రైడింగ్ మోడ్‌ లతో పాటు 7 అంగుళాల ట చ్‌స్క్రీన్ డిస్‌ ప్లేను కూడా అందించారు. ఈ సిరీస్‌లో ఇలాంటి పెద్ద టచ్‌ స్క్రీన్ ఉన్న ఏకైక మోడల్ ఇదే. టెక్నాలజీ ఫీచర్లను ఇష్టపడే వినియోగదారులను ఈ బైక్ బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

Advertisement

కంపెనీ..ఈ బైక్‌లకు సంబంధించిన కొన్ని కీలక వివరాలను ఇంకా వెల్లడించలేదు. కెర్బ్ వెయిట్, సీట్ హైట్, సస్పెన్షన్ సెటప్, పూర్తి ఛార్జింగ్ టైమ్ లాంటి స్పెసిఫికేషన్లు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అలాగే బుకింగ్‌లు ప్రారంభమైనప్పటికీ, వినియోగదారులకు డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

Read Also: ఫోన్ టచ్ చేయాల్సిన పనిలేదు.. ఈ హెల్మెట్ అన్నీ చూసుకుంటుంది!

Related News

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

రెనాల్ట్ కార్లపై లక్షల్లో ఆఫర్లు.. డస్టర్‌పై ఏకంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

Big Stories

Advertisement
×