Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన. రేవతి అనే మహిళ మృతి.. శ్రీతేజ తీవ్రంగా గాయపడటం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ ఇది. అయితే ఈ కేసులో విచారణకు రావాల్సిందే అని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా అందరిలో ఒకటే క్వశ్చన్. అల్లు అర్జున్ కోర్టుకు వస్తాడా? రాడా? కానీ ఆఖరి నిమిషంలో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఆయన లీగల్ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
ఎట్టకేలకు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు అల్లుఅర్జున్. అయితే అది వ్యక్తిగతంగా కాదు. ఆయన ముంబైలోనే ఉండిపోయారు. మొదట ఆన్‌లైన్ ద్వారా హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ కోర్టు మొదట అందుకు అంగీకరించలేదు. దీంతో కోర్టు మొట్టికాయలు తప్పవనే చర్చ జరిగింది. అల్లు అర్జున్ న్యాయవాదులు కోర్టులో ఆబ్సెన్స్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో అల్లు అర్జున్ రాకపోవడానికి కారణాలు తెలిపారు. అదే సమయంలో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు రిక్వెస్ట్ చేయడంతో కోర్టు అంగీకరించింది. దీంతో ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్. కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఈ విచారణ జరిగినట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ మాత్రమే కాదు. ఈ కేసులో A1 నుంచి A10 గా ఉన్న సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా అనారోగ్య కారణాల వల్ల కోర్టుకు రాలేదు. వారి తరపున కూడా లీగల్ టీమ్స్ మెమోలు సమర్పించాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా ఉన్నాడు. నిందితులను విచారించిన అనంతరం తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. మరి ఆ రోజైన పుష్పరాజ్ కోర్టు బోనులో నిలబడతారా లేదా వర్చువల్‌గానే ఎంట్రీ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Storey By: Appa Rao Big Tv
Also read: Sai Krishna: హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు జగన్ టీమ్ సంచలన ఫిర్యాదు..!