E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!
Advertisement

EV Charging Station Business: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో EV ఛార్జింగ్ స్టేషన్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. సరైన ప్రదేశంలో ఈ బిజినెస్ మొదలు పెడితే, మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఈవీలు

తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో ఈవీల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాల్లో కూడా EVల వినియోగం పెరుగుతోంది. నగరాల్లో చాలామంది ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకున్నా, హైవేలపై ప్రయాణించే వారికి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఇంకా తక్కువగా ఉన్నాయి. అందుకే జాతీయ రహదారులు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, ఫుడ్ కోర్టుల దగ్గర ఈ స్టేషన్లకు మంచి అవకాశాలు ఉన్నాయి.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే ఎలా?

Advertisement

EV ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే కనీసం 800 నుంచి 1,500 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. ఒకేసారి రెండు నుంచి నాలుగు కార్లు ఛార్జ్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలి. అలాగే కమర్షియల్ విద్యుత్ కనెక్షన్, ఫాస్ట్ ఛార్జర్లు, డిజిటల్ పేమెంట్ సౌకర్యం, ఛార్జింగ్ నిర్వహణ కోసం అవసరమైన సాఫ్ట్‌ వేర్ ఉండాలి. ఈ వ్యాపారానికి ప్రత్యేక లైసెన్స్ అవసరం లేకపోయినా, స్థానిక మున్సిపాలిటీ లేదంటే గ్రామ పంచాయతీ అనుమతులు, విద్యుత్ సంస్థ నుంచి కమర్షియల్ కనెక్షన్, అవసరమైన భద్రతా అనుమతులు తీసుకోవాలి.

రెండు రకాలుగా ఈవీ బిజినెస్

వ్యాపారాన్ని రెండు విధాలుగా ప్రారంభించవచ్చు. ఒకటి సొంతంగా ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి నడపడం. ఇందులో లాభం మొత్తం మీదే ఉంటుంది. అయితే, మార్కెటింగ్, మెయింటెనెన్స్ బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. ఇంకో విధానం ప్రముఖ కంపెనీల ఫ్రాంచైజీ తీసుకోవడం. ఇందులో వారి బ్రాండ్, మొబైల్ యాప్, టెక్నికల్ సహాయం లభించడం వల్ల ఈజీగా  కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పలు కంపెనీలు పార్ట్ నర్ షిప్ అవకాశాలను అందిస్తున్నాయి. వారి అధికారిక వెబ్‌ సైట్లలో దరఖాస్తు చేసుకుని ఫ్రాంచైజీ కోసం అప్లై చేయవచ్చు. కొన్ని సంస్థలు లోన్ సౌకర్యాలు, సాంకేతిక సహాయం కూడా అందిస్తున్నాయి.

ఎంత ఖర్చు అవుతుంది?

Advertisement

EV ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు సుమారు రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు పెట్టుబడి అవసరం కావచ్చు. ఛార్జర్ల సంఖ్య, విద్యుత్ కనెక్షన్, ఇతర సదుపాయాలపై ఆధారపడి మారుతుంది. సరైన ప్రదేశంలో స్టేషన్ ఉంటే ప్రారంభంలోనే నెలకు సుమారు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రద్దీ ప్రాంతాలు, హైవేల వద్ద అయితే ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్‌ తో పాటు టీ, కాఫీ, స్నాక్స్, కార్ వాష్ లాంటి అదనపు సర్వీసులు అందిస్తే మరింత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

Read Also: ఈవీ మార్కెట్ లో టీవీఎస్ దూకుడు.. జస్ట్ 7 నెలల్లో 3 లక్షలకుపైగా స్కూటర్ల సేల్!

Tags

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×