E-Paper
Advertisement

భారత్‌లో యాపిల్ ప్రొడక్ట్‌ల ధరలు భారీగా పెంపు.. ఏ గ్యాడ్జెట్ ధర ఎంత పెరిగిందంటే?

భారత్‌లో యాపిల్ ప్రొడక్ట్‌ల ధరలు భారీగా పెంపు.. ఏ గ్యాడ్జెట్ ధర ఎంత పెరిగిందంటే?
Advertisement

Apple Price Hike India: భారతదేశంలో యాపిల్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టపడే వారికి కంపెనీ పెద్ద షాక్ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు విపరీతంగా పెరగడంతో.. యాపిల్ తమ మ్యాక్ కంప్యూటర్లు, ఐప్యాడ్‌లు, హోమ్‌పాడ్‌ల ధరలను భారీగా పెంచేసింది. దాదాపు రూ.70,000 వరకు ఈ ధరల పెరుగుదల ఉండటం గమనార్హం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరగడం వల్ల డేటా సెంటర్ల నుంచి చిప్‌లకు డిమాండ్ ఎక్కువైంది. దీంతో ఆ భారాన్ని యాపిల్ సంస్థ కస్టమర్లపై వేయక తప్పలేదు.

Mac mini, MacBook ధరల్లో భారీ మార్పులు:

కొత్తగా వచ్చిన మ్యాక్ మినీ M4 (256GB) బేస్ మోడల్ ధర ఏకంగా 38 శాతం పెరిగింది. ఇదివరకు రూ.59,900కి లభించిన ఈ డివైజ్.. ఇప్పుడు రూ.82,900కి చేరుకుంది. దీంతో ఒకేసారి రూ.23,000 పెరిగిందన్నమాట. ఇక హై-ఎండ్ మోడల్ అయిన మ్యాక్ మినీ M4 ప్రో ధర ఏకంగా రూ.50,000 పెరిగి రూ.1,99,900కి చేరింది. వీటితో పాటు మ్యాక్‌బుక్ ఎయిర్ M5 (13-ఇంచ్) ప్రారంభ ధర రూ.1,49,900గా మారింది. ప్రొఫెషనల్స్ వాడే మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ ధరలపై రూ.70,000 నుండి రూ.లక్ష వరకు అదనపు భారం పడింది.

Advertisement

Also Read: రూ.35 వేల బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ లాంటి టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!

iPad లవర్స్‌కు కూడా తప్పని భారం:

కేవలం కంప్యూటర్లు మాత్రమే కాదు.. టాబ్లెట్ ప్రియులకు కూడా ఈ ధరల సెగ తగిలింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఐప్యాడ్ ఎయిర్ 11-ఇంచ్ (M4) ధర రూ.25,000 పెరిగి ఇప్పుడు రూ.89,900కి చేరుకుంది. అలాగే ప్రీమియం ఐప్యాడ్ ప్రో (256GB, M5) మోడల్ ధర రూ.99,990 నుండి ఏకంగా రూ.1,39,900కి పెరిగింది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మ్యాక్‌బుక్ నియో ధర కూడా రూ.10,000 పెరిగి రూ.79,900గా మారింది.

స్మార్ట్ హోమ్ డివైజ్‌ల ధరలు సైతం పైపైకి:

Advertisement

ఇంటిని స్మార్ట్‌గా మార్చే యాపిల్ టీవీ, హోమ్‌పాడ్ స్పీకర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. యాపిల్ టీవీ 4K (64GB) వేరియంట్ ధర రూ.14,900 నుండి రూ.25,900కి పెరగ్గా, 128GB వేరియంట్ ధర రూ.31,900కి చేరింది. యాపిల్ హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్ ధర రూ.44,900కి, చిన్నదైన హోమ్‌పాడ్ మినీ ధర రూ.15,900కి పెరిగాయి.

ధరల పెరుగుదలకు కారణమిదే:

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఏఐ హవా నడుస్తోంది. దీంతో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లలో వాడే డ్రామ్ (DRAM), నంద్ (NAND) ఫ్లాష్ మెమరీ చిప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. యాపిల్ తమ కొత్త డివైజ్‌లలో మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం ఎక్కువ RAM, యూనిఫైడ్ మెమరీని వాడుతోంది. ఈ విడిభాగాల ధరలు పెరగడంతో, చాలా కాలం పాటు కస్టమర్లపై భారం పడకుండా ఆపగలిగామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచడం తప్పలేదని యాపిల్ స్పష్టం చేసింది.

Also Read: అమెజాన్‌లో షాకింగ్ ప్రైస్ డ్రాప్.. రూ.37,000 తగ్గిన Samsung Galaxy S26 Plus ఫోన్ ధర!

Related News

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

Big Stories

Advertisement
×