Tata Harrier and Safari Stealth Edition 2026: టాటా మోటార్స్ మరోసారి తమ ప్రీమియం ఎస్‌యూవీలకు కొత్త లుక్ ను తీసుకొచ్చింది. హారియర్, సఫారీ మోడళ్లను స్టెల్త్ ఎడిషన్ గా విడుదల చేసింది. ప్రత్యేకమైన మ్యాట్ బ్లాక్ థీమ్, లగ్జరీ ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లతో ఈ కొత్త ఎడిషన్ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. గతంలో స్టెల్త్ ఎడిషన్ ను పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తీసుకువచ్చిన టాటా.. ఈసారి మరింత విస్తృతంగా వినియోగదారులకు అందిస్తోంది.
కొత్త హారియర్ స్టెల్త్ ఎడిషన్ ధర రూ.23.43 లక్షల నుంచి రూ.26.01 లక్షల వరకు ఉండగా, సఫారీ స్టెల్త్ ఎడిషన్ రూ.24.04 లక్షల నుంచి రూ.26.76 లక్షల మధ్య లభిస్తోంది. హారియర్ లో ఇది ఫియర్ లెస్ అల్ట్రా ట్రిమ్ మీద ఆధారపడి రెడీ కాగా, సఫారీలో అకాంప్లిష్డ్ అల్ట్రా ట్రిమ్ పై రూపొందింది. ఈ స్టెల్త్ ఎడిషన్ లో మ్యాట్ స్టెల్త్ బ్లాక్ ఎక్స్ టీరియర్ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. బాడీ అంతా బ్లాక్ కలర్ లో ఉండటంతో పాటు, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూ అదే మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ముందు ఫెండర్ మీద ప్రత్యేకంగా స్టెల్త్ బ్యాడ్జ్ కూడా ఉండటంతో ఈ వెర్షన్ సాధారణ మోడళ్ల కంటే పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది.
కారు లోపల కూడా అదే డార్క్ థీమ్ కొనసాగుతుంది. పూర్తిగా బ్లాక్ కలర్ ఇంటీరియర్, కార్బన్ నోయిర్ లెదరెట్ సీట్లు, ప్రీమియం ఫినిషింగ్ తో క్యాబిన్ మరింతగా ఆకట్టుకుంటుంది. టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ కోసం ప్రత్యేక డిజైన్ డయల్ ను కూడా అందించారు. అంతేకాదు, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్ లాంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ స్పెషల్ ఎడిషన్ లో 14.9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 13 స్పీకర్ల JBL డాల్బీ అట్మోస్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్ కమాండ్ తో పనిచేసే పనోరమిక్ సన్ రూఫ్, అలెక్సా కనెక్టివిటీ, ఆర్కేడ్ యాప్ సూట్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS లాంటి ఆధునిక టెక్నాలజీని టాటా ఇందులో అందించింది.
ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ హారియర్, సఫారీలో ఉన్న 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 170 హెచ్‌పీ శక్తి, 280 ఎన్‌ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 2.0 లీటర్ క్రయోటెక్ టర్బో డీజిల్ ఇంజిన్ 170 హెచ్‌పీ పవర్ తో పాటు 350 ఎన్‌ఎం టార్క్ ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లకు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. డార్క్ లుక్‌ను ఇష్టపడే ఎస్‌యూవీ అభిమానులకు ఈ స్టెల్త్ ఎడిషన్ బాగా ఆకట్టుకుంటుంది.
Read Also: గ్రాండ్ విటారాపై బంపర్ ఆఫర్.. వామ్మో.. అన్ని వేల డిస్కౌంటా!?