E-Paper
Advertisement

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?
Advertisement

Tata Nexon CNG vs EV vs Diesel vs Petrol: కారు కొనాలనుకునే వారికి ఇప్పుడు ఇంధనం విషయంలో ఎన్నో ఎంపికలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, CNGతో పాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఒకే మోడల్‌లో ఇన్ని ఆప్షన్లు అందించే కార్లు చాలా తక్కువ. టాటా నెక్సాన్ అలాంటి వాటిలో ఒకటి. పెట్రోల్, డీజిల్, CNG, EV రూపాల్లో లభించే నెక్సాన్‌లో మీ అవసరానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడం ఆసక్తికరం.

పెట్రోల్.. డ్రైవింగ్‌ కు ఈజీ ఆప్షన్!

నెక్సాన్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120hp పవర్, 170Nm టార్క్ అందిస్తుంది. మాన్యువల్ నుంచి AMT, 7 స్పీడ్ DCA వరకు పలు గేర్‌ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర సుమారు రూ.7.40 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఇంజిన్ నగర ప్రయాణాలకు సరిపడే పనితీరును ఇస్తుంది. అయితే, మైలేజీ విషయంలో   అంతగా ఆకట్టుకోదు. పరీక్షల్లో DCA వెర్షన్ నగరంలో 7.7kpl, హైవేపై 13.9kpl ఇచ్చింది. దీంతో ఎక్కువగా ప్రయాణించే వారికి దీని నిర్వహణ ఖర్చు కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది.

డీజిల్.. హైవే ప్రయాణాలకు బెస్ట్!

Advertisement

డీజిల్ నెక్సాన్ ధర సుమారు రూ.9.15 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంటుంది. పెట్రోల్‌తో పోలిస్తే దీని అమ్మకాలు తగ్గినప్పటికీ, సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇప్పటికీ డీజిల్ ఆకర్షణీయమైన ఎంపికగానే ఉంది. ముఖ్యంగా హైవేపై మంచి టార్క్, మెరుగైన మైలేజీ దీని బలం. పరీక్షల్లో డీజిల్ మాన్యువల్ 17.95kpl మైలేజీ ఇచ్చింది. కిలోమీటరుకు సుమారు రూ.5.30 ఖర్చు రావడంతో, ఏడాదికి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

ఖర్చు తగ్గించుకోవాలంటే CNG!

నెక్సాన్ CNG ధర రూ.8.35 లక్షల నుంచి రూ.13.60 లక్షల వరకు ఉంది. ఇందులో 1.2 లీటర్ టర్బో ఇంజిన్ CNGపై 100hp, 170Nm అందిస్తుంది.  నగర పరీక్షలో 15.1km/kg, హైవేపై దాదాపు 24km/kg మైలేజీ వచ్చింది. కిలోమీటరుకు సుమారు రూ.4.28 ఖర్చుతో ఇది ICE వెర్షన్లలో అత్యంత పొదుపైనదిగా గుర్తింపు పొందింది. అయితే, CNG స్టేషన్ల రద్దీ, కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత ఇబ్బందిగా మారొచ్చు.

EVతో తక్కువ రన్నింగ్ కాస్ట్!

Advertisement

నెక్సాన్ EV ధర రూ.12.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు ఉంది. 30kWh, 45kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. వాస్తవ పరిస్థితుల్లో ఇవి వరుసగా 200 కిలోమీటర్లకు పైగా, దాదాపు 350 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలవు. 45kWh వెర్షన్ వేగవంతమైన DC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 20-80 శాతం ఛార్జింగ్‌కు సుమారు 29 నిమిషాలు పడుతుంది. హోమ్ ఛార్జింగ్‌తో కిలోమీటరుకు దాదాపు రూ.1.03 మాత్రమే ఖర్చవుతుంది.

ఏ నెక్సాన్ కొంటే మంచిది?

తక్కువ ప్రారంభ ధర, ఎక్కువ గేర్‌బాక్స్ ఆప్షన్లు కావాలంటే పెట్రోల్ ఆప్షన్ తీసుకోవాలి. హైవేలు, సుదూర ప్రయాణాలు చేసే వారికి డీజిల్ బాగుంటుంది. రోజువారీ వినియోగంలో ఇంధన ఖర్చు తగ్గించుకోవాలంటే CNG మంచి బ్యాలెన్స్ ఇస్తుంది. ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉండి, రన్నింగ్ కాస్ట్‌ ను వీలైనంత తక్కువగా ఉంచాలనుకునే వారికి నెక్సాన్ EV మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: రెనాల్ట్ కార్లపై లక్షల్లో ఆఫర్లు.. డస్టర్‌పై ఏకంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..

Tags

Related News

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

రెనాల్ట్ కార్లపై లక్షల్లో ఆఫర్లు.. డస్టర్‌పై ఏకంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

Big Stories

Advertisement
×