Upcoming Bikes And Scooters July 2026: ఇండియన్ టూవీలర్ మార్కెట్ లోకి జూలైలో క్రేజీ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. పలు ప్రముఖ కంపెనీలు కొత్త బైక్‌లు, స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాయి. ప్రీమియం ఇంపోర్టెడ్ బైక్స్, కుటుంబ అవసరాలకు అనువైన ఎలక్ట్రిక్ స్కూటర్ల వరకు పలు కొత్త మోడళ్లు రాబోతున్నాయి. బైక్ ప్రియులు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ జూలైలో విడదలయ్యే మోడల్స్ ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జూలైలో విడుదలయ్యో మోడల్స్ లో డుకాటి హైపర్ మోటార్డ్ V2. ఈ బైక్ ధర రూ.17 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, అద్భుతమైన పనితీరుతో ఈ బైక్ యువతను ఆకర్షించనుంది. స్పోర్టీ రైడింగ్ ను ఇష్టపడే వారికి మంచి ఆప్షన్ గా మారనుంది.
ఇక యమహా నుంచి ల్యాండర్ 250 బైక్ కూడా భారత మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. తాజా అంచనా ధర రూ.1.70 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు ఉండొచ్చు. ఈ బైక్‌ను ముఖ్యంగా ఆఫ్ రోడ్ రైడింగ్, అడ్వెంచర్ ట్రిప్ లను ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఎత్తైన ప్రాంతాలు, మట్టి రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించేందుకు ఈ మోడల్ అనుకూలంగా ఉంటుంది.
బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్ నార్టన్ కూడా భారత మార్కెట్ పై దృష్టి పెట్టింది. నార్టన్ మ్యాంక్స్ బైక్‌ను రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. క్లాసిక్ డిజైన్ తో పాటు ప్రీమియం ఫీచర్లు ఉండటంతో ఈ బైక్ హైఎండ్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా కీలక మార్పులు కనిపించనున్నాయి. యమహా మ్యాక్సీ స్కూటర్ ఏరాక్స్ కు ఎలక్ట్రిక్ వెర్షన్ ను తీసుకురానుంది. యమహా ఏరాక్స్ ఇ పేరుతో రానున్న ఈ స్కూటర్ పర్యావరణానికి మేలు చేసే రవాణా పరిష్కారంగా నిలవనుంది. సిటీ రైడింగ్ కు ఇది మంచి ఆప్షన్ గా భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఏథర్ కూడా కొత్త అడుగు వేయబోతోంది. కంపెనీ కొత్త EL ప్లాట్ ఫారమ్ ను దీపావళి సమయానికి విడుదల చేయాలని భావిస్తోంది. కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మరింత విశాలమైన, సౌకర్యవంతమైన స్కూటర్లను ఈ ప్లాట్ ఫారమ్ ఆధారంగా తీసుకురానుంది.
మరోవైపు టీవీఎస్ కూడా పాపులర్ జూపిటర్ స్కూటర్ కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త జూపిటర్ 110 డిజైన్ ఆధారంగా ఈ స్కూటర్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
Read Also: టాటా To మహీంద్రా.. మేలో అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!