E-Paper
Advertisement

ఒకటి రెండు కాదు ఒకేసారి 5 కొత్త కార్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

ఒకటి రెండు కాదు ఒకేసారి 5 కొత్త కార్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Upcoming Tata Cars 2026-27: టాటా మోటార్స్ కార్ల లైనప్‌ లో త్వరలోనే భారీ మార్పులు కనిపించనున్నాయి. పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లపైనా కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. FY2027 కోసం టాటా ప్రకటించిన ప్రొడక్ట్ ప్లాన్‌ లో కొత్త మోడళ్లతో పాటు పలు ఫేస్‌లిఫ్ట్‌ లు కూడా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కార్లు టెస్టింగ్ దశలో కనిపించగా, మరికొన్ని మోడళ్లను 2027లో మార్కెట్‌లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇందులో సఫారీ EV, నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్, అవిన్యా, టిగోర్ ఫేస్‌ లిఫ్ట్, టిగోర్ EV ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి.

1.టాటా సఫారీ EV

రాబోయే మోడళ్లలో సఫారీ EVపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంది. ఇది టాటా నుంచి వచ్చే మూడు వరుసల సీట్లతో కూడిన ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. హారియర్ EV కంటే పైస్థానంలో ఉండే ఈ మోడల్ 2026 పండుగ సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. హారియర్ EVకు సంబంధించిన Acti.EV+ ఆర్కిటెక్చర్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.  65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లు, RWDతో పాటు AWD వేరియంట్లు ఉండొచ్చని సమాచారం. ధర సుమారు రూ.22.5 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండనుంది.

2.నెక్స్ట్ జనరేషన్ టాటా నెక్సాన్

Advertisement

టాటా నెక్సాన్‌ కు కొత్త తరం మోడల్ కూడా సిద్ధమవుతోంది. 2026 ఆగస్టులో భారీ క్యామోఫ్లేజ్‌ తో ఉన్న టెస్ట్ కార్లు రోడ్లపై కనిపించాయి. కొత్త నెక్సాన్‌లో డిజైన్, బాడీ పర్సెంటేజ్, టెక్నాలజీలో మార్పులు ఉండే అవకాశం ఉంది. పెట్రోల్, సీఎన్‌జీ, డీజిల్‌ తో పాటు EV వెర్షన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. 2027లో ఈ న్యూ జెనరేషన్ నెక్సాన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ధర సుమారు రూ.8 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

3.టాటా అవిన్యా

ప్రీమియం EV విభాగంలో టాటా తీసుకొస్తున్న కీలక మోడల్ అవిన్యా. జెన్-3 బోర్న్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. అధునాతన కనెక్టివిటీ, ADAS, వేగవంతమైన ఛార్జింగ్ వంటి టెక్నాలజీలపై కంపెనీ దృష్టి పెట్టింది. 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా. అయితే బ్యాటరీ, రేంజ్, మోటార్ వివరాలను టాటా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

4.టాటా టిగోర్ ఫేస్‌ లిఫ్ట్

Advertisement

ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌ లో టిగోర్‌ కు కూడా అప్‌ డేట్ రానుంది. పేటెంట్ ఫోటోస్ లో కొత్త హెడ్‌ లైట్లు, సవరించిన గ్రిల్, కొత్త బంపర్, అల్లాయ్ వీల్స్ లాంటి మార్పులు కనిపించాయి. క్యాబిన్‌లో కూడా కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్ వంటి అప్‌డేట్లు రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుత 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లు కొనసాగవచ్చని సమాచారం. 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

5.టాటా టిగోర్ EV ఫేస్‌లిఫ్ట్

టిగోర్ EVకి కూడా ఇదే సమయంలో కొత్త లుక్ లో వచ్చే అవకాశం ఉంది. అప్‌ డేట్ చేసిన టిగోర్ డిజైన్‌కు అనుగుణంగా EV వెర్షన్‌లో ప్రత్యేకమైన గ్రిల్, వీల్స్, బంపర్ డిజైన్ ఉండొచ్చని భావిస్తున్నారు. బ్యాటరీ, మోటార్, రేంజ్  వివరాలు ఇంకా వెల్లడించలేదు. 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ మోడల్ ధర సుమారు రూ.12.5 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

Read Also: పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

Tags

Related News

పుతిన్ ఆరస్ vs జిన్‌ పింగ్ హాంగ్‌ కీ L5.. ఎవరి కారు ఎక్కువ పవర్‌ ఫుల్?

80ల్లో సైకిల్ ఉంటే అదో గొప్ప.. అప్పటి నిబ్బాలు చేసే విన్యాసాలకు నిబ్బీలు ఫిదా!

కారు కాదు.. కదిలే కోట.. జిన్‌పింగ్ హాంగ్‌కీ N701 ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఎండ్ల బండిపై హయ్.. హయ్.. మారుతీ కారులో రయ్ రయ్.. 80’s జర్నీ మరపురానిది!

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

Big Stories

Advertisement
×