E-Paper
Advertisement

హైవేలో ఏసీ సూపర్ కూలింగ్.. ట్రాఫిక్‌ లో ఎందుకు తగ్గిపోతుంది? అసలు మ్యాటర్ ఇదే!

హైవేలో ఏసీ సూపర్ కూలింగ్.. ట్రాఫిక్‌ లో ఎందుకు తగ్గిపోతుంది? అసలు మ్యాటర్ ఇదే!
Advertisement

Car AC Cooling: వేసవిలో కారు నడిపే చాలా మంది డ్రైవర్లు ఒక విషయాన్ని గమనిస్తుంటారు. హైవేలో లేదంటే వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఏసీ బాగా చల్లగా పని చేస్తుంది. కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, భారీ ట్రాఫిక్‌ లో కారు ఆగి ఉన్నప్పుడు అదే ఏసీ అంత చల్లగా అనిపించదు. దీంతో చాలామంది ఏసీలో సమస్య వచ్చిందేమో అనుకుంటారు. కానీ, అసలు మ్యాటర్ ఏంటంటే..

కారు ఏసీ ఎలా పని చేస్తుందంటే?

కారు ఏసీ పని చేసే విధానాన్ని అర్థం చేసుకుంటే ఈ తేడా ఎందుకు వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా ఏసీ చల్లని గాలిని తయారు చేయదు. క్యాబిన్‌ లోని వేడిని బయటకు పంపి లోపలి వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ విధానంలో కండెన్సర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సాధారణంగా కారు ముందు గ్రిల్ వెనుక భాగంలో ఉంటుంది.

Advertisement

కారు ప్రయాణిస్తున్నప్పుడు ముందు నుంచి వచ్చే గాలి నేరుగా కండెన్సర్‌పై పడుతుంది. దీంతో అందులోని వేడి త్వరగా బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా ఏసీ మరింత సమర్థవంతంగా పనిచేసి క్యాబిన్‌ ను వేగంగా చల్లబరుస్తుంది. అందుకే హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు వెంట్ల నుంచి వచ్చే గాలి మరింత చల్లగా అనిపిస్తుంది.

అయితే ట్రాఫిక్‌లో కారు నెమ్మదిగా కదిలినా,పూర్తిగా ఆగిపోయినా పరిస్థితి మారుతుంది. ఆ సమయంలో కండెన్సర్‌కు గాలి ప్రవాహం తగ్గిపోతుంది. అదే సమయంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, రోడ్డుపై నుంచి వచ్చే వేడి, చుట్టూ ఉన్న వాహనాల ఇంజిన్ల వేడి, నేరుగా పడే సూర్యరశ్మి లాంటి కారణాల వల్ల ఏసీపై భారం పెరుగుతుంది. దీంతో కూలింగ్ కొంత తగ్గినట్లు అనిపిస్తుంది.

లేటెస్ట్ కార్లలో ఈ సమస్య తక్కువే!

Advertisement

లేటెస్ట్ కార్లలో ఈ సమస్య తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్త మోడళ్లలో పవర్ ఫుల్ కండెన్సర్లు, పవర్ ఫుల్  కూలింగ్ ఫ్యాన్లు, స్మార్ట్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లలో ఏసీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.

అయితే ట్రాఫిక్‌ లో కూలింగ్ తగ్గిందంటే తప్పనిసరిగా గ్యాస్ తక్కువైందని అనుకోవడం సరైంది కాదు. చాలా మంది చేసే పొరపాటు ఇదే. రిఫ్రిజెరెంట్ తక్కువగా ఉండటం కారణం కావచ్చు. కానీ, కండెన్సర్ ఫ్యాన్ సరిగా పనిచేయకపోవడం, కండెన్సర్‌లో దుమ్ము పేరుకుపోవడం, కంప్రెసర్ అరిగిపోవడం, ఇంజిన్ కూలింగ్ సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చు. కారు ఆగి ఉన్నప్పుడు స్వల్పంగా కూలింగ్ తగ్గడం సాధారణమే. కానీ, వెంట్ల నుంచి వేడి గాలి రావడం, ట్రాఫిక్‌లో ఏసీ పూర్తిగా పని చేయకపోవడం, ఇంజిన్ ఉష్ణోగ్రత పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే చెక్ చేయించడం మంచిది.

ఏసీ చక్కగా పని చేయాలంటే ఎలా?

ఏసీ పనితీరు మెరుగ్గా ఉండాలంటే కండెన్సర్‌ను శుభ్రంగా ఉంచడం, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌ను సమయానికి మార్చడం, కూలింగ్ ఫ్యాన్లు సరిగా పనిచేస్తున్నాయో? లేదో? చూడడం అవసరం. అలాగే ఎండలో పార్క్ చేసినప్పుడు సన్‌షేడ్‌లు ఉపయోగించడం మంచిది.

Read Also: E20 ఫ్యూయల్ తో ఇంజిన్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా? పాత కారు ఓనర్లకు కొత్త టెన్షన్!

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×