E-Paper
Advertisement

సకుటుంబ సపరివారానికీ.. తిట్ల తలంటు..! మీరిక వర్తమానం.. భవిష్యత్తు శూన్యం.. కొడుకు గడీనీ కూల్చుతాం!

సకుటుంబ సపరివారానికీ.. తిట్ల తలంటు..! మీరిక వర్తమానం.. భవిష్యత్తు శూన్యం.. కొడుకు గడీనీ కూల్చుతాం!
Advertisement

కేటీఆర్‌ అడ్డా.. సిరిసిల్ల గడ్డ మీద సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కవాతు సక్సెసయ్యింది. కేటీఆర్‌పై రేవంత్‌ చేసిన రాజకీయ బల ప్రదర్శన సూపర్ హిట్టయ్యింది. సిరిసిల్ల వేదికగా రేవంత్‌ తనదైన మార్కు శపథం చేసి దీనికి ఆసక్తికర ముగింపు పలికారు. సకుటుంబ సపరివారంగా ఎవరినీ వదలకుండా అందరి అవినీతి బాగోతాలను బయటపెట్టారు సీఎం.

మొన్న అసెంబ్లీ వేదికగా చెప్పిన అక్రమాస్తులకు .. పార్ట్‌ -2ను జోడించి.. సిటీలో మూడు ఫైవ్‌ స్టార్ హోటళ్ల.. హై టెక్‌ సిటీ చుట్టూ.. అక్రమాస్తులు కూడబెట్టిన వివరాలను వెల్లడించారు. దీనిపై వివరణ ఇస్తావా? అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు సీఎం. దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తావా? అని ప్రశ్నించారాయన. ఉంటందుకు ఇళ్లేలేదన్న కేటీఆర్‌ ఇంటిల్లిపాదికీ ఫామ్‌హౌజులున్నాయని వివరాలు బయటపెట్టి.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం పేదల బతులకు మార్చలేదు గానీ, వేల కోట్లు, వందల ఎకరాల భూములు.. లక్షల కోట్ల విలువైన ఆస్తులు కూడగట్టారని ధ్వజమెత్తారు.

Advertisement

అమెరికాలో చిప్పలు కడిగితే లక్షల కోట్లు ఎలా సంపాదించావని అడిగిన సీఎం.. ఇవన్నీ తెలంగాణ జనాన్ని మోసం చేసి.. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి నోట్ల పంట పండించుకున్నారని విమర్శించారు. దళితులంటే ఎంత చిన్నచూపో.. అప్పుడూ ఇప్పుడూ జనం చూశారని, బీఆరెస్‌కు అధికారం ఇస్తే.. బీసీలకు, దళితులకు తీవ్ర అన్యాయమే జరిగిందన్నారు సీఎం. మొన్న కేసీఆర్‌ గడీని కుప్పకూల్చామని, ఇప్పుడు కొడుకు కేటీఆర్‌ గడీని కూల్చేస్తామన్నారు.

ఇక బీఆర్‌ఎస్‌ గతమే తప్ప భవిష్యత్‌ లేదని సిరిసిల్ల వేదికగా శపథం చేశారు సీఎం. కేసీఆర్‌ పథకాలేమీ తను ఆపలేదని, అన్నీ అమలు చేస్తున్నానని క్లారిటీ ఇచ్చుకున్నారు. పద్మశాలి బిడ్డను మండలికి పంపుతానని, ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకుంటానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు సీఎం. గోదావరి నీటిని, ఇసుకను, హైదరాబాద్‌లో భూములను కొల్లగొట్టారని, ఆంధ్రవాళ్లతో సోపతి చేసి వేల కోట్ల ఆస్తులు కేటీఆర్‌ కూడబెట్టుకున్నారని ఆరోపించారు.

Tags

Related News

సినిమా రేంజ్‌లో స్కెచ్చేసిన దొంగలు.. ఆర్టీసీ బస్సులో రూ.3 కోట్ల గోల్డ్ మాయం.. కానీ చివరకి..?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. రాంరెడ్డికి సీటిచ్చింది అందుకేనా..?

బరి గీసి నిలిచిన బీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చిన హరీశ్‌.. ! రసవత్తరంగా మారనున్న పోరు.. !

జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం.. 2027 ఏప్రిల్ 1 నుంచి ఆ పనిలో మార్పులు!

టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలో ఊహించని రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ వాడకం?

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

ఎమ్మెల్సీ బరిలో రాంచందర్ రావు.. అధిష్టానం ఆదేశిస్తే సిద్ధమని లీకులు!

Big Stories

Advertisement
×