E-Paper
Advertisement

రవితేజ ఇరుముడి దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్‌లో దూకుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రవితేజ ఇరుముడి దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్‌లో దూకుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Irimudi OTT Success:‘ఇరుముడి’ ..శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన బాక్సాఫీస్ ని ఎలా చీల్చి చెండాడిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఏకంగా 250 కోట్ల పై చిలుకు వసూళ్ళు కొల్లగొట్టి సాలిడ్ గా సత్తా చాటింది. ఇక థియేటర్లలో దుమ్ము రేపిన ఈ సినిమా ఇపుడు ఓటీటీలోనూ తన సత్తా చాటుతుండటం విశేషం.

అవును..థియేట్రికల్ రన్ పూర్తయి నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఇపుడు తెలుగు ప్రేక్షకులనే కాకుండా దేశ విదేశాల్లోని ఆడియన్స్‌ను కూడా మెస్మరైజ్ చేస్తుంది మరి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన గ్లోబల్ టాప్-10 నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో ‘ఇరుముడి’ టాప్ ప్లేస్‌లో నిలవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

వరల్డ్ వైడ్ గా నంబర్ వన్

సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు ఉన్న లెక్కల్ని తీస్తే ‘ఇరుముడి’ వరల్డ్ వైడ్ గా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం బట్టి చూస్తే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని ఎలా మెప్పించిందో అర్థమవుతుంది.అది కూడా ఒకటో రెండు కాదు ఏకంగా ఈ ఒక్క వారంలోనే ఈ సినిమాను 3.4 మిలియన్ల మంది చూశారంటూ నెట్‌ఫ్లిక్స్ లెక్కలతో సహా బయటపెట్టడం విశేషం. ఇక మాములుగా ఇంగ్లీష్ సినిమాలు డామినేట్ చేసే నెట్ ఫ్లిక్స్ లో ఒక తెలుగు సినిమా ఇలా ఇలా సత్తా చాటడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.

Advertisement

ఇక సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 3.4 మిలియన్ల వ్యూస్ వస్తే ఆ తర్వాత కూడా సినిమా జోరు తగ్గకుండా కొనసాగడంతో ఇప్పటివరకు 6.8 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టడం విశేషం

డిజిటల్ గా ఇంకెంత ఇరగదీస్తుందో !

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ ఇరుముడి సినిమా క్యాస్టింగ్  విషయానికి వస్తే రవితేజ కి జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా, సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించారు. కథలోని ఎమోషన్ సినిమాను ఓటీటీ ఆడియన్స్‌కు దగ్గర చేశాయి. ముఖ్యంగా థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమాను విరగబడి చూడటంతో సినిమాకి డిజిటల్ వ్యూస్ భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది.ఈ మధ్య కాలంలో థియేటరికల్ రన్ తగ్గిపోయిన ఈ సమయంలో తెలుగు సినిమాలకు ఓటీటీ మార్కెట్ కూడా చాలా ముఖ్యమని చెప్పక్కర్లేదు.

also read :‘పొడుస్తున్న పొద్దుమీద’ ఉంటే.. ప్యారడైజ్ దుమ్మురేపేదా?

ఇక నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లో ‘ఇరుముడి’ సాధించిన సక్సెస్ ని చూస్తే కంటెంట్ సరిగ్గా కన్వే చేస్తే భాష అడ్డంకి కాదని, రీజినల్ సినిమాలు కూడా వరల్డ్ వైడ్ గా సత్తా చాటగలవని మరోసారి ప్రూవ్ అయింది. చూడాలి మరి ముందు ఈ ఇరుముడి సినిమా డిజిటల్ గా ఇంకెంత ఇరగదీస్తుందో !

Tags

Related News

జిమ్‌లో మంచు విష్ణు కష్టాలు చూస్తే.. ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది!

యాంకర్ గా  25 ఏళ్ల ప్రస్థానం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సుమ కనకాల!

‘పొడుస్తున్న పొద్దుమీద’ ఉంటే.. ప్యారడైజ్ దుమ్మురేపేదా?

బాలీవుడ్ డెబ్యూకి సిద్ధమైన చందు మొండేటి..పూర్తి డీటెయిల్స్ ఇవే!

రణబాలి సెకండ్ డాక్యుమెంటరీ ‘ది హిస్టరీ వుయ్ ఫర్ గాట్’ రిలీజ్!

ఆట సందీప్ ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?

ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×