BigTV English

Burning of Polavaram Files: ఫైల్స్ దగ్ధం కేసులో కొత్త ట్విస్ట్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు

Burning of Polavaram Files: ఫైల్స్ దగ్ధం కేసులో కొత్త ట్విస్ట్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ తగలబడిన ఘటనపై విచారణ జరుగుతుండగానే .. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ పరిపాలన కార్యాలయంలో ఫైల్స్‌ దగ్ధమయ్యాయి. అవి పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన డాక్యుమెంట్స్ గా చెబుతున్నారు. కార్యాలయంలోని అధికారులే కాల్చేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన్‌ చేస్తూ వేస్ట్‌ పేపర్లను దహనం చేసినట్టు అధికారులు చెబుతున్నా.. ఇది మరో మదనపల్లె ఘటనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూదందాలు బయటకు వస్తాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైసీపీ నేతలు , అక్కడి సిబ్బంది సహకారంతో మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలోని ఫైళ్లు తగలబెట్టించారన్న ఆరోపణలున్నాయి. దాన్ని సీనియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటన జరిగిన వెంటనే డీజీపీని హెలికాఫ్టర్‌లో అక్కడకి పంపించారు. ప్రస్తుతం దానిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.


ఇప్పుడు పోలవరం ఫైల్స్ వంతు వచ్చింది. పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనుల కోసం చేపట్టిన భూసేకరణ చెల్లింపుల్లో భారీ స్కామ్‌ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 19 కోట్లు దాకా మింగేశారని చెబుతున్నారు. తాజాగా దహనమైంది ఆ ప్రధాన ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలోని ఫైళ్లే అవ్వడం కలకలం రేపుతోంది. సమాచారం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లడంతో సగం కాలిన ఫైళ్లను, పత్రాలను అక్కడి అధికారులు లోపలకు తీసుకుని వెళ్లి దాచేయడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది.

పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు అమలుచేసే కార్యాలయం ధవళేశ్వరంలో ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి మీదుగా విశాఖపట్నానికి నీటిని తీసుకెళ్లడానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 212 కిలోమీటర్ల మేర ఎడమ ప్రధాన కాలువను నిర్మిస్తున్నారు. ఇందులో చాలా వరకూ భూసేకరణ జరిగింది. దానికి సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు సంబంధించిన ఫైళ్లు, ఎవరి భూమిని ఎంతకు, ఎపుడు సేకరించామనే ఫైళ్లు ధవళేశ్వరంలో ఉన్నాయి. గతంలో స్పెషల్‌ కలెక్టర్‌గా పనిచేసిన అధికారి దేవీపట్నం తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులకు దక్కకుండా రూ.19 కోట్లు కాజేశారన్న ఆరోపణలున్నాయి.

Also Read: ఏపీలో మరో ఘటన.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం

22మంది నకిలీ రైతులను సృష్టించి రూ.6 కోట్లు నొక్కేసినట్లు నమోదైన కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లకు నిప్పుపెట్టారన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. . ఘటన వెలుగు చూడగానే రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి. జిల్లా అధికారులకు దానిపై సమాచారం ఇచ్చారు.  తాను స్వయంగా కార్యాలయానికి వెళ్లి కాగిన ఫైళ్లను పరిశీలించారు. అధికారులను గట్టిగా నిలదీశా రు.

ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఫైళ్లు తగులబెట్టారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేస్తున్నారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపిస్తున్నారు

పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలకు వెనుకాడబోమని మంత్రి కందుల దుర్గేశ్ హెచ్చరిస్తున్నారు. కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తగలబడిన దస్త్రాలను పరిశీలించడంతో పాటు నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీవో శివజ్యోతి జిరాక్స్‌ పేపర్లుగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని విమర్శించారు.

మొత్తమ్మీద ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైళ్లు దగల పడుతుండటం చర్చనీయాంశంగా మారాయి.  గత అయిదేళ్లలో వైసీపీ నేతలతో అంటకాగిన ప్రభుత్వ సిబ్బంది. అప్పటి అవినీతి భాగోతాలు తమ మెడకు చుట్టుకోకుండా ఉండటానికే ఈ తంతంగాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×