BigTV English

KTR Emotional Tweet: నువ్వు రాఖీ కట్టకున్నా.. నీ కష్టాల్లో నేను తోడుంటా.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

KTR Emotional Tweet: నువ్వు రాఖీ కట్టకున్నా.. నీ కష్టాల్లో నేను తోడుంటా.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

KTR Emotional Tweet about Rakhi Celebrations(TS news updates): రాఖీ పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఘనగా నిర్వహించుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మహిళా నేతలు రాఖీలు కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ విప్ గొంగిడి సునీతతో పాటు ఇతర నేతలు కేటీఆర్‌కు రాఖీ కట్టి హారతి పట్టారు. ఈ సందర్బంగా కేటీఆర్ తన సోదరి కవితను గుర్తు చేసుకున్నారు.


ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. రాఖీ పండగ సందర్భంగా తన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకుంటూ భావొద్వేగానికి గురయ్యారు. ‘నువ్వు ఈరోజు రాఖీ కట్టకపోయినా..నీ కష్టాల్లో నేను ఎప్పుడూ తోడుంటా..’ అని ట్వీట్ చేశారు. గతంలో తనకు కవిత రాఖీ కట్టిన ఫొటోను, అలాగే కవితను ఈడీ అరెస్ట్ చేసిన సమయంలో ఆమె పక్కన తాను నిల్చున్న మరో ఫొటోను కలిపి ఎక్స్ లో షేర్ చేశారు.

Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలపై విరుచుకుపడిన బండి సంజయ్


కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్ట్ చేసింది. అయితే ఏప్రిల్ 11వ తేదీన ఆమె జ్యుడీషల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉండగానే సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఆమె గత 155 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు.

Related News

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

Telangana: అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు.. ఇకపై సీబీఐ చేతికి, సుప్రీంకోర్టు ఆదేశం

KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు

Big Stories

×