E-Paper
Advertisement

నాలుగు దశాబ్దాల బాలాపూర్ లడ్డూ సంచలన చరిత్ర ఇదే?

నాలుగు దశాబ్దాల బాలాపూర్ లడ్డూ సంచలన చరిత్ర ఇదే?
Advertisement

Balapur Laddu: బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో అసలైన హైలైట్ అంటే..లడ్డూ వేలం. ఏటా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటుంది. గణేషుడి లడ్డూను దక్కించుకునేందుకు పోటీలు పడతారు బిడ్డర్లు. ఈసారీ అంతకుమించి అన్న రేంజ్‌లో సాగింది ఆక్షన్‌. పోటాపోటీగా సాగిన వేలంపాటలో రికార్డ్‌ ధర దక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన వేలంలో సామా ప్రణీత్‌రెడ్డి సొంతమైంది బాలాపూర్‌ లడ్డూ.

నాలుగు దశాబ్దాల చరిత్ర..

బాలాపూర్ గణేష్ ఉత్సవాలకు దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది.1980లో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో.. 1994 నుంచి లడ్డూ వేలం సంప్రదాయం కొనసాగుతోంది. తొలిసారి కేవలం రూ.450తో మొదలైన వేలం పాట..ఇప్పుడు లక్షల్లోకి చేరింది. ప్రతి ఏడాది రికార్డులు తిరగరాస్తూ బాలాపూర్ లడ్డూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మొత్తం 9 మంది..

Advertisement

చివరి పూజలు, గ్రామోత్సవం అనంతరం బొడ్రాయి దగ్గర జరిగిన వేలంపాటలో లడ్డూ కోసం మొత్తం 9 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఆక్షన్‌లో..అర్బన్ గ్రూప్‌కు చెందిన సామా ప్రణీత్ రెడ్డి 39 లక్షల హయ్యెస్ట్ బిడ్ వేశారు. దీంతో స్వామివారి 21 కేజీల లడ్డూ ఆయన సొంతమైంది. గతేడాది లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలకు దక్కించుకున్న రికార్డును ఈసారి బ్రేక్ చేసింది.

ప్రత్యేకమైన నమ్మకం..

బాలాపూర్ లడ్డూ వేలం వెనుక ఓ ప్రత్యేకమైన నమ్మకం ఉంది. స్వామివారి ప్రసాదం ఇంటికి తీసుకెళ్తే శుభం జరుగుతుందనే భక్తుల విశ్వాసమే ఈ వేలానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. అందుకే లడ్డూ కోసం ఏటా పోటీ పెరుగుతోంది. ఒక చిన్న లడ్డూతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.39 లక్షల రికార్డ్ వరకు చేరింది.

ఈసారి కూడా..

Advertisement

లడ్డూ వేలం ముగిసిన అనంతరం..స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పూజల తర్వాత సామా ప్రణీత్ రెడ్డి లడ్డూను స్వీకరించారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ లడ్డూ కేవలం ఒక ప్రసాదం కాదు..బాలాపూర్ గణేష్‌పై భక్తుల నమ్మకానికి ప్రతీక. ఏటా రికార్డులు క్రియేట్ చేస్తూ..బాలాపూర్ లడ్డూ క్రేజ్ అంతకుమించి అన్నట్లుగా కొనసాగుతోంది.

Also read: సినిమా చేయాలంటే హీరోల భార్యలకు నచ్చాలి.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్!

Tags

Related News

Gen-Z యూత్‌ కోసం.. నెల్లూరు రూరల్ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్!

కృష్ణా జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షాలు!

పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు.. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన అరెస్ట్ చెల్లదు

అక్టోబర్ 2న నో యూపీఐ డే.. దేశవ్యాప్తంగా వ్యాపారుల వినూత్న నిరసన!

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో లంచాల దందా కలకలం

ఐక్యరాజ్యసమితి వేదికగా నెతన్యాహూ సంచలనం..!

అన్నింటికీ ఆయనే ప్రెస్ మీట్ పెడితే ఎలా.. సజ్జల తీరుపై వైసీపీ నేతలు ఫైర్!

Big Stories

Advertisement
×