E-Paper
Advertisement

సినిమా చేయాలంటే హీరోల భార్యలకు నచ్చాలి.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా చేయాలంటే హీరోల భార్యలకు నచ్చాలి.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్!
Advertisement

Tapsee Pannu: తాప్సీ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె తెలుగులో వస్తాడు నా రాజు, మిస్టర్ ఫర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి, దరువు వంటి పలు సినిమాలలో నటించారు. ఇలా తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ ఈమెకు అనుకున్నంత సక్సెస్ మాత్రం రాలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తమిళ సినిమాలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడ కూడా ఈమెకు చేదు అనుభవం ఎదురు కావడంతో 2013 వ సంవత్సరంలో ఛష్మే బద్దూర్‌ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

బాలీవుడ్ లో స్థిరపడిన తాప్సీ..

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తాప్సి మిషన్ మంగల్, తాపడ్, బేబీ, పింక్, రష్మీ రాకెట్ వంటి తదితర సినిమాలలో నటిస్తూ పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారని చెప్పాలి. ఇలా ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా ఈమె కొనసాగారు. ఇకపోతే తాప్సి ఇటీవల కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన కెరీర్ లో కొన్ని సినిమాల నుంచి తప్పుకోవడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

హీరో భార్యకు నచ్చకపోవటంతోనే..

Advertisement

తాప్సి కొన్ని సినిమాలకు ఎంపిక అయినప్పటికీ ఉన్నఫలంగా తనని సినిమాల నుంచి తప్పించారని ఈమె తెలిపారు. ఇలా చివరి నిమిషంలో సినిమా నుంచి తొలగించడంతో తాను వెళ్లి చిత్ర యూనిట్ ను సంప్రదించానని, అయితే హీరో భార్యకు నేను నచ్చకపోవటం వల్లే నన్ను ఆ సినిమా నుంచి తప్పించారనే విషయం తెలిసి తాను షాక్ అయ్యానని తాప్సి తెలిపారు. ఇక మరో సినిమాలో స్వయంగా హీరోకి నేను నచ్చకపోవడంతో వేరే హీరోయిన్ ను తీసుకున్నారని ఈమె తెలిపారు. ఇలా సినిమాలలో మేము నటించాలి అన్నా కూడా హీరో భార్యలకు కూడా మేము నచ్చాల్సిందే అంటూ తాజాగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరో భార్య ఎవరు?

ఇకపోతే సినిమాలలో బోల్డ్ సన్నివేశాలు గురించి కూడా ఈమె మాట్లాడారు. కెరియర్ మొదట్లో నాకు బోల్డ్ సీన్లపై ఏ విధమైనటువంటి అవగాహన ఉండేది కాదు అందుకే తాను ఇలాంటి సన్నివేశాలు కూడా సినిమాలో ఒక భాగమని నటించానని తెలిపారు. కానీ ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు అవసరం లేకపోయినా నన్ను అలా చూపించినట్టు సినిమా చూసిన తర్వాతనే నాకు అర్థమైందని ఈమె తెలిపారు. ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తాప్సిని సినిమా నుంచి తప్పించిన ఆ హీరో భార్య ఎవరు? ఆమె ఎందుకు తాప్సీని వద్దనుకున్నారు? అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Also Read: ‘ది ప్యారడైజ్’ సినిమా పై వేణు స్వామి రివ్యూ .. సమస్యలు తెచ్చుకోవద్దంటూ!

Related News

‘ది ప్యారడైజ్’ సినిమా పై వేణు స్వామి రివ్యూ .. సమస్యలు తెచ్చుకోవద్దంటూ!

నైజాంలో నాని మేనియా..రెండు రోజులకే బ్రేక్ ఈవెన్?

మహేష్ ‘వారణాసి’ పై కార్తికేయ బిగ్ అప్డేట్..గట్టిగనే ప్లాన్ చేస్తున్నారే!

‘ది ప్యారడైజ్ ‘.. కేసీఆర్ రోల్ పై రాహుల్ రామకృష్ణ ట్వీట్!

డబ్బింగ్ షూర్ చేసిన ‘ కాకా ‘ .. సంక్రాంతి విడుదలకు సిద్ధం!

తప్పుగా తీసుకోవద్దు.. జర్నలిస్టు నాగేంద్ర వివాదంపై సంపూర్ణేష్ బాబు వివరణ!

అంతా మీ ఇష్టమే.. ‘ది ప్యారెడైజ్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై స్పందించిన నాని

Big Stories

Advertisement
×