BigTV English

MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై కాంగ్రెస్ ఫోకస్.. అభ్యర్ధులు వీరే

MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై కాంగ్రెస్ ఫోకస్.. అభ్యర్ధులు వీరే

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి.. మాట ప్రకారం 53 వేల పైగా ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చింది. దీంతో నిరుద్యోగ వర్గం తమకు మద్దతుగా నిలబడుతుందని అంచనా వేస్తోంది హస్తం పార్టీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక దగ్గర పడుతుంది. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన రేవంత్ రెడ్డి సర్కారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఈజీ గా గెలుస్తామన్న ధీమాతో కనిపిస్తుంది.

ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు రెండు టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 31 నాటికి ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కానుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపికపై కసరత్తు కాంగ్రెస్ ఇప్పటికే మొదలుపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ఇప్పటికే సేకరిస్తుంది. రాష్ట్ర అధినాయకత్వం ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సమీక్ష సమావేశాలు సైతం పూర్తి చేశారు. ఈ వారంలో అభ్యర్థుల ఎంపిక కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది.


కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే ఆ సారి ఆయనకు టికెట్ దక్కడం అనుమానమే అంటున్నారు. ఆ క్రమంలో కొత్త అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విద్యాసంస్థలు యజమానులు కాంగ్రెస్ నుండి బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. ఎమిగోస్ విద్యాసంస్థల అధినేత రమణా రెడ్డి, అల్ఫోస్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.

ఏమిగోస్ విద్యాసంస్థల అధినేత రమణారెడ్డి గాంధీ భవన్లో ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌ని కలిశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాలను కలసి తన బయో డేటాను సమర్పించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యే లు ఎంపీ లను కలసి మద్దతు కోరతానంటున్నారు.

Also  Read: ఒకరు పరామర్శలో డ్యాన్సులు, మరొకరు విచారణకు వెళ్తూ హడావిడి? ఏందయ్యా ఇది?

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలా..? మద్దతు ఇవ్వాలా అనే దానిపై చర్చ నడుస్తుంది ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ నియోజక వర్గానికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ గా అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. ఈ నియోజక వర్గం లో కమ్యూనిస్టుల అభ్యర్థిగా నర్సి రెడ్డి తిరిగి బరిలో ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కామ్రెడ్లను కలుపుకుని పోయిన కాంగ్రెస్.. ఈ సారి అక్కడ వారికి మద్దతిస్తుందంటున్నారు.

ఇక రెండో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం.. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం రఘోత్తమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో సీనియర్ నేతలు.. జిల్లా మంత్రుల అభిప్రాయాలు సేకరించాలని పీసీసీ ప్రెసిడెంట్ భావిస్తున్నారు. పార్టీలో ఉన్న ఉపాధ్యాయ సంఘం నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాత.. ఆ నియోజక వర్గం లో పార్టీ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తొలి ప్రాధాన్యతగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి అక్కడ గెలిచి తీరతామన్న ధీమా పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతుంది.

 

Related News

Rajnath Singh: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Devaragattu Bunny Utsavam: కొట్టుకు చావడమే సాంప్రదాయమా..! మాల మల్లేశ్వర ఏంటి కథ..

Telangana BJP: అలక, ఆవేదన, అసంతృప్తి.. కొత్త నేతలకు గడ్డుకాలమేనా?

Solar Village: సీఎం ఊరుకు సౌర సొబగులు.. దేశంలోనే రెండో సోలార్ విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

MLC Kavitha VS Harish Rao: సిద్దిపేట నుంచి కవిత పోటీ?

Local Body Elections: ముదురుతున్న స్థానిక ఎన్నికల రగడ.. ఎన్నికలు జరుగుతాయా? లేదా?

Kandi Srinivasa Reddy: కంది శ్రీనివాస్ రెడ్డికి.. కాంగ్రెస్ బిగ్ షాక్!

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ రచ్చ.. అసలేం జరిగిందంటే!

Big Stories

×