BigTV English

Gaddam Vamsi Krishna: పెద్దపల్లి గడ్డం పంచాయితీ! ఎంపీపై అంత యాంటీనా?

Gaddam Vamsi Krishna: పెద్దపల్లి గడ్డం పంచాయితీ! ఎంపీపై అంత యాంటీనా?

Gaddam Vamsi Krishna: పెద్దపల్లి జిల్లాలో నా రూటే సెపరేటు అన్నట్లు సాగుతుందట ఆ కాంగ్రెస్ ఎంపీ వ్యవహారశైలి .. జిల్లాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీటును కూడా కాంగ్రెస్సే సొంతం చేసుకుంది.. మంచి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారంట .. సాక్షాత్తు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబుతో కూడా ఆయన సత్సంబంధాలు కొనసాగించడం లేదంట.. ఒక వైపు ఎంపీ తండ్రి అయిన గడ్డం వివేక్ మంత్రి పదవి రేసులో ఫోకస్ అవుతున్న తరుణంలో ఆయన వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారిందంట. అసలు వంశీకృష్ణకి పార్టీ నేతలతో అంత గ్యాప్ ఎందుకొచ్చింది?


పెద్దపల్లి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్

పెద్దపల్లి జిల్లాలో చాలా సంవత్సారాల తరువాత అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని ఎమ్మెల్యే, ఎంపి స్థానాలు గెలుచుకుంది . పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ స్థానాలతో పాటుగా పెద్దపల్లి ఎంపి స్థానాన్ని భారీ మెజారిటీతో గెలుపొందింది. రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్లమెంటు ఎన్నికలలో శ్రీధర్‌బాబుతో సహా అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడైన గడ్డం‌ వంశీకృష్ణని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు.


మక్కాన్‌సింగ్ ఠాగూర్, విజయరమణారావు, మంత్రి శ్రీధర్‌బాబులతో లోపించిన సఖ్యత

కాని ఇప్పుడు ఆ ఎంపీతో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ ఠాగూర్, విజయరమణారావు, మంత్రి శ్రీధర్‌బాబులతో సఖ్యత లోపించినట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది. గతంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో‌ తనకి ప్రోటోకాల్ విషయంలో అధికారులు సహాకరించడం లేదని , అధికారిక కార్యక్రమాలకి తనని పిలవడం లేదని గడ్డం‌ వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. తరువాత కూడా పెద్దపల్లి మాజీ ఎంపీ, తన తాత అయిన కాకా వెంకటస్వామి వర్ధంతిని పెద్దపల్లిలో అధికారికంగా నిర్వహించలేదని మీడియా సమావేశం పెట్టి విమర్శించారు.

నియోజకవర్గాల్లో తన వర్గీయులను మాత్రమే కలిసి వెళ్తున్న ఎంపీ

అప్పటి నుండి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రెండుమూడు సందర్భాల్లో తప్ప ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. జనవరి నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ గ్రామ సభల్లో కూడా ఆయన పాల్గొనలేదు. దాంతో చాలా రోజులుగా ఎంపీ, ఎమ్మెల్యే ల మధ్య సయోధ్య కొరవడిందని పార్టీ క్యాడరే చెపుతోంది. వంశీకృష్ణ తన పార్లమెంటు సెగ్మెంట్‌లో పర్యటించినప్పుడు కూడా సుల్తానాబాద్, పెద్దపల్లి, గోదావరిఖనిల్లో తన వర్గీయులని‌ మాత్రమే కలసి వెళ్తుండటం విమర్శల పాలవుతోంది.

అభివృద్థిపై ఎమ్మెల్యేలతో కలిసి‌ సమీక్షలు నిర్వహించని ఎంపీ

ఎంపీలకి తన పార్లమెంటు సెగ్మెంట్లలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం… ప్రతిఏటా సుమారు పది కోట్ల రూపాయలు వరకు పార్లమెంటు సెగ్మెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. వాటితో నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలో ఎమ్మెల్యేలతో కలిసి‌ సమీక్షలు నిర్వహించి అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంపీ నిధులకి సంబంధించిన పనులపై సమాచారం లేక ఇంజనీరింగ్ శాఖ అధికారులు కూడ అంచనాలు తయ్యారు చెయ్యలేకపోతున్నారంట. ఎంపీ, ఎమ్మెల్యే ల మధ్య సఖ్యత లేకపోవడం వలనే అధికారులు అంచనాలు రూపొందించలేక పోతున్నారని, అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: భూమికి దగ్గర్లో ఏలియన్స్.. శాస్త్రవేత్తలకు దొరికిన ఆధారాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని క్యాడర్ ఆందోళన

వారి వైఖరి ‌ఇలాగే ఉంటే ఆ ప్రభావం స్థానిక సంస్థలపై ఖచ్చితంగా చూపుతుందని క్యాడర్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల నిర్వహించిన అంబేద్కర్ జయంతి‌ కార్యక్రమాలలో కూడా ఎంపి‌ వంశీకృష్ణ ఎమ్మెల్యే ‌లతో కాకుండా విడివిడిగానే పాల్గొని నివాళులు అర్పించారు. మంచిర్యాలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్న కార్యక్రమం లో కూడా ఎంపి వంశీకృష్ణ పాల్గొనకపోవడంతో పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ నిజమేనని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో తన తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్ ల నియోజకవర్గాల్లో తప్ప మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఎంపీ వంశీ కలిసి పనిచేయకపోతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆ ఎఫెక్ట్ స్తానిక‌సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×