E-Paper
Advertisement

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!
Advertisement

Kailasagiri Toy: కొండపై మబ్బులు తాకుతుంటే కింద సముద్ర కెరటాలు పలకరిస్తుంటే.. చుట్టూ విశాఖ అందాలు కనిపిస్తుంటే ఆ అందాల మధ్య చిన్నారుల కేరింతలు పర్యాటకుల సందడి సింపుల్ గా చెప్పాలంటే ఇదే కైలాసగిరి టాయ్ ట్రైన్ ప్రయాణం. విశాఖకు వచ్చే పర్యాటకులకు కైలాసగిరి ఓ ప్రత్యేక ఆకర్షణ. ఆ అందాలకు మరింత వన్నె తెచ్చింది ఈ చిన్న రైలు. 2007లో ప్రారంభమైన కైలాసగిరి టాయ్ ట్రైన్ కొండపై పర్యాటకుల ప్రయాణంలో ఓ మధుర జ్ఞాపకంగా మారింది. కేవలం 150 రూపాయల టికెట్‌తో రోజుకు 500 నుంచి 800 మంది వరకు పర్యాటకులు ఈ రైలులో ప్రయాణించేవారు. నెలకు దాదాపు 30 లక్షల ఆదాయం కూడా వచ్చేది. అలా కొండపై చుక్‌చుక్‌ అంటూ పరుగులు తీస్తూ.. పర్యాటకుల ఆనందాన్ని రెట్టింపు చేసింది ఈ చిన్న రైలు. కానీ కాలం మారింది. రైలుకు మరమ్మతులు పెరిగాయి. ట్రాక్ దెబ్బతింది. నిర్వహణలోనూ సమస్యలు మొదలయ్యాయి.

2024లో ఒప్పందం

గతంలో బీఓటీ విధానంలో ఓ ప్రైవేట్ సంస్థ టాయ్ ట్రైన్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఆదాయంలో 60 శాతం సంస్థకు 40 శాతం వీఎంఆర్‌డీఏకు వచ్చేలా ఒప్పందం జరిగింది. అయితే నిబంధనల ఉల్లంఘన, బకాయిల చెల్లింపుల అంశాలతో 2024లో వీఎంఆర్‌డీఏ ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత నిర్వహణ బాధ్యతలు వీఎంఆర్‌డీఏ చేతుల్లోకి వచ్చినా సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. పట్టాలపై పరిగెత్తాల్సిన రైలు మరమ్మతుల కోసం ఆగిపోయింది. గతేడాది డిసెంబర్‌లో బ్రేకులు ఫెయిల్ కావడంతో టాయ్ ట్రైన్ పూర్తిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి కైలాసగిరి కొండపై రైలు కూత లేదు. పర్యాటకుల కేరింతలు లేవు. చిన్నారుల సందడి లేదు.

Advertisement

Also Read: పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

కొత్త విద్యుత్ రైలు..

టాయ్ ట్రైన్ మళ్లీ అందుబాటులోకి వస్తే పిల్లలు, కుటుంబాలతో వచ్చే పర్యాటకులకు చాలా ఆనందంగా ఉంటుందని త్వరగా రైలు ప్రారంభించాలని పర్యాటకులు కోరుకుంటున్నారు. పిక్నిక్ సీజన్ దగ్గరపడుతోంది. క్రిస్మస్, సంక్రాంతి వరుస సెలవులతో కైలాసగిరికి పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాత రైలుకు వీడ్కోలు పలికి కొత్త విద్యుత్ రైలును పట్టాలెక్కించాలని వీఎంఆర్‌డీఏ నిర్ణయించింది. విధివిధానాలు ఖరారైన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అంటున్నారు. పాత టాయ్ ట్రైన్‌తో ఎన్నో జ్ఞాపకాలు కొత్త విద్యుత్ రైలుపై ఎన్నో ఆశలు సముద్రాన్ని చూపించే ఆ ప్రయాణం విశాఖ అందాలను పలకరించే ఆ రైలు ప్రయాణం మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని పర్యాటకులు ఎదురుచూస్తున్నారు.

కైలాసగిరి కొండ పై..

Advertisement

కైలాసగిరి అందాల వడిలో చుక్‌చుక్ అంటూ మళ్లీ రైలు పరుగులు తీస్తే.. ఆ సందడి మరింత రెట్టింపవ్వడం ఖాయం. పాత టాయ్ ట్రైన్ జ్ఞాపకంగా మిగిలినా కొత్త విద్యుత్ రైలు ఆశగా కనిపిస్తోంది. కైలాసగిరి కొండపై మళ్లీ రైలు కూత ఎప్పుడు వినిపిస్తుంది? పర్యాటకుల ఎదురుచూపులకు ఎప్పుడు తెరపడుతుంది? విశాఖ అందాల మధ్య ఆ చిన్న రైలు మళ్లీ పరుగులు పెట్టే రోజు కోసం పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also read: 13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×