Virat Kohli: రికార్డులు వస్తాయి పోతాయి.. కానీ కొన్ని మైలురాళ్లు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి చరిత్రలో సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు ఒకటి. ఇప్పుడు ఆ రికార్డు వైపు మరోసారి వేగంగా దూసుకెళ్తున్నాడు విరాట్ కోహ్లీ. విండీస్‌పై విధ్వంసక సెంచరీతో.. సచిన్ రికార్డుకు మరింత చేరువయ్యాడు. తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. 88 బంతుల్లో 139 పరుగులతో అదరగొట్టి.. తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 86కు చేర్చాడు. 296 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సెంచరీ చేయగా.. కోహ్లీ దూకుడుతో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది కోహ్లీ కెరీర్‌లో 55వ వన్డే సెంచరీ. వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు. ఇప్పుడు సచిన్ 100 సెంచరీల రికార్డుకు కోహ్లీ మరో 14 శతకాల దూరంలో ఉన్నాడు.
కష్టమైన లక్ష్యమే అయినా.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కోహ్లీకి కొత్తేమీ కాదు. పదేళ్లకు పైగా తన ఆటతో ఇదే నిరూపిస్తున్నాడు. రెండు నెలల తర్వాత బ్యాట్ పట్టినా.. కోహ్లీలో అదే జోరు కనిపించింది. 157 స్ట్రైక్‌రేట్‌తో సెంచరీ చేయడం అతడి ఫిట్‌నెస్, ఫామ్‌కు నిదర్శనమని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. కోహ్లీ ఆటలో రిథమ్ చాలా ముఖ్యమని చాలా మంది మాజీలు అభిప్రాయపడ్డారు. తక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నా.. తన సహజమైన రిథమ్ ను అందుకోవడం గొప్ప విషయమని చెప్పాడు. విరాట్‌కు ఒత్తిడి పెరిగినప్పుడే అత్యుత్తమ ప్రదర్శన వస్తుందని మరికొందరు అంటారు. సచిన్‌ను ఆదర్శంగా తీసుకున్న కోహ్లీ.. 100 సెంచరీల లక్ష్యాన్ని పెట్టుకున్నా ఆశ్చర్యం లేదన్నాడు.
అయితే కోహ్లీ మాత్రం రికార్డులపై పెద్దగా మాట్లాడడు. సచిన్ ఎప్పటికీ సచినే.. ధోనీ ఎప్పటికీ తన తొలి కెప్టెన్ అంటూ తన గౌరవాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌కే పరిమితమైన కోహ్లీకి 100 సెంచరీల మార్క్ చేరుకోవాలంటే మరిన్ని అవకాశాలు, ఫిట్‌నెస్, అదృష్టం అవసరం. 86 సెంచరీలు.. 15 అడుగుల దూరంలో సచిన్ రికార్డు. వయసు పెరుగుతున్నా.. ఆకలి తగ్గని కోహ్లీ మరో చరిత్ర సృష్టిస్తాడా..? అన్నది ఇప్పుడు క్రికెట్ అభిమానుల ఆసక్తి.
Also read: ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!