E-Paper
Advertisement

రాజ్యాంగ వ్యవస్థ పై బాంబు పేల్చిన జర్నలిస్టులు.. వెలుగులోకి సంచలనాలు!

రాజ్యాంగ వ్యవస్థ పై బాంబు పేల్చిన జర్నలిస్టులు.. వెలుగులోకి సంచలనాలు!
Advertisement

ECI Software: కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల మధ్య విభేదాలపై వచ్చిన కథనాలు సంచలనంగా మారాయి. గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పలు నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. తమకు సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఓటర్ల పేర్ల చేర్పు, తొలగింపు వంటి అంశాలపై వారు అభ్యంతరాలు తెలిపినట్లు కథనం పేర్కొంది. అయితే ఈ స్టోరీతో ఆ పత్రిక సీనియర్ ఎడిటర్ రితికా చోప్రా ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఏళ్ల తరబడి ఎన్నికల సంఘం పనితీరుపై పనిచేస్తున్న ఆమె… సైలెంట్‌గా బయటపెట్టిన ఈ రిపోర్ట్ ఇప్పుడు దేశంలో సునామీ సృష్టిస్తోంది.

కమిషనర్లు అభ్యతంరం..

రితికా చోప్రా కథనానికి కొనసాగింపుగా ECI కేంద్రీకృత సాఫ్ట్‌వేర్‌పై మరో సంచలన కథనం వచ్చింది. ఇందులో రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఢిల్లీ నుంచే ఐటీ సాఫ్ట్ వేర్ ద్వారా ఓట్ల మార్పులు ఎలా జరిగిపోతున్నాయో ఇందులో వివరించారు. అంతే కాదు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా, కమిషనర్లు అభ్యతంరం చెప్తున్నా లెక్కచేయకుండా కమిషన్ ఈ తంతు ఎలా సాగించిందో బయటపెట్టారు. ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌లో ఒకసారి నమోదైన మార్పులను తిరిగి వెనక్కి తీసుకోవడానికి స్థానిక అధికారులకు ఎలాంటి సాంకేతిక సదుపాయం కల్పించలేదు. దీనివల్ల పొరపాట్లు లేదా మార్పులను సరిదిద్దే అధికారం కూడా ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎన్నికల కమిషనర్లు జోషి, సంధూ గత కొన్ని నెలలుగా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ఉండే ఎస్డీఎం స్థాయి అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా, ఈసీఐ ఐటీ విభాగం ఎలా అడ్డుకుంటుందో వారు తమ నివేదికలలో స్పష్టంగా రికార్డు చేశారు. ఈసీ సాఫ్ట్‌వేర్ లోపాల్ని బయటపెట్టిన ఈ జర్నలిస్ట్ పేరు ఆయుషీ కర్.

భారీ తేడాలు..

Advertisement

ఇక ఎన్నికల సంఘంపై ఎప్పటినుంచో వార్ కొనసాగిస్తున్న మరో జర్నలిస్ట్ పూనమ్ కౌర్. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా ఎలక్టోరల్ బాండ్స్‌ గుట్టుని మొట్టమొదట బయటపెట్టిన ఘనత పూనమ్‌దే. ఆమె బయటపెట్టిన రిపోర్ట్ తర్వాత బాండ్స్ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈవీఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఉన్న భారీ తేడాలపై డేటాతో సహా ఈసీని కౌంటర్ చేశారు పూనమ్. ఆమె చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి రామ్‌నాథ్ గోయెంకా అవార్డు కూడా అందుకున్నారు. రితికా చోప్రా, ఆయుషీ కర్, పూనమ్ అగర్వాల్… ఈ ముగ్గురు జర్నలిస్టుకు సోషల్ మీడియాలో జోహార్లు చెప్తున్నారు.

Also read: మలేషియాలో బ్యాన్ చేసిన కీర్తి సురేష్ బోల్డ్ మూవీ.. తెలుగులో రిలీజ్, ఎప్పుడంటే?

Tags

Related News

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. సర్ వివాదంపై స్పష్టత కోరిన ఎన్డీయే మిత్రపక్షాలు!

నాగాలాండ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. ఆ కీలక సిస్టమ్‌కు గ్రీన్ సిగ్నల్!

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధానికి ఊహించని షాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్!

కేసీఆరే రావాలి… కేసీఆరే కావాలి..! మరి కేటీఆర్ ఏం కావాలి..? షాడో సీఎంగానే ఉండాల్నా..!? సీఎం అయ్యే యోగం లేదానే బాపూ..!

అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో దారుణం.. అడుగు వేయాలంటే జంకుతున్న జనం!

Big Stories

Advertisement
×