E-Paper
Advertisement

నాగాలాండ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

నాగాలాండ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!
Advertisement

Nagaland Liquor: 19 మరణాలు. 19 అరెస్టులు. దాదాపు మూడు వేల మద్యం సీసాల స్వాధీనం. నాగాలాండ్‌లో కల్తీ మద్యం మిగిల్చిన లెక్కలివి. మోకోక్‌చుంగ్, టుయెన్‌సాంగ్ జిల్లాల్లో.. రెండు రోజుల్లో ఈ మరణాలు చోటు చేసుకున్నాయ్. మోకోక్‌చుంగ్‌లో 8 మంది, టుయెన్‌సాంగ్‌లో 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మరణాలపై దర్యాప్తు కోసం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సప్లై చేశారు? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు.

గౌహతి ల్యాబ్‌కు నమూనాలు..

మరణాలకు అసలు కారణాన్ని నిర్ధారించేందుకు మద్యం నమూనాలను గౌహతి ల్యాబ్‌కు పంపారు. అక్కడే.. ఫోరెన్సిక్ టెస్టులు చేయనున్నారు. టెస్ట్ రిపోర్టులు వచ్చిన తర్వాత.. మృతుల మరణాలకు కల్తీ మద్యమే కారణమైందా? అనే అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న మద్యంలో మిథనాల్ ఆనవాళ్లు కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ.. దాని పరిణామాన్ని కొలిచే పరికరాలు లేనందున.. ఎంత శాతం ఉందో నిర్ధారించలేకపోయామని FSL డిమాపూర్ తెలిపింది. అయితే, మద్యం తాగిన కొద్దిసేపటికే.. బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని పోలీసులు తెలిపారు.

కల్తీ మద్యం..

Advertisement

నాగాలాండ్‌లో 1990 నుంచి మద్యం నిషేధం అమల్లో ఉంది. అయినా అక్రమ మద్యం అమ్మకాలు ఆగడం లేదు. పైగా.. ఇలాంటి ఘటన అక్కడేం కొత్త కాదు. ఇటీవలే.. టుయెన్‌సాంగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా.. 9 మంది కల్తీ మద్యం సేవించి మృతి చెందారని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని, లేబుల్ లేని, అనుమానాస్పద మద్యాన్ని సేవించొద్దని పోలీసులు ప్రలను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినాసరే.. కల్తీ మద్యం దొరుకుతూనే ఉంది. తాగుతూనే ఉన్నారు. కొందరైతే.. ప్రాణాలే కోల్పోతున్నారు. ఇప్పుడు రాబోయే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్, సిట్ దర్యాప్తు.. ఈ కేసులో కీలకం కానున్నాయి.

Also read: గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

Tags

Related News

మచిలీపట్నంలో హోరెత్తిన వీఆర్ఏ జేఏసీ ధర్నా.. వారి డిమాండ్లు ఇవే!

ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. సర్ వివాదంపై స్పష్టత కోరిన ఎన్డీయే మిత్రపక్షాలు!

రాజ్యాంగ వ్యవస్థ పై బాంబు పేల్చిన జర్నలిస్టులు.. వెలుగులోకి సంచలనాలు!

ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. ఆ కీలక సిస్టమ్‌కు గ్రీన్ సిగ్నల్!

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధానికి ఊహించని షాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్!

Big Stories

Advertisement
×