Srikanth Odela About Mohan Babu:నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా రిలీజ్ అయి మంచి వసూల్లని కొల్లగొడుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్.ఇక ఈ ఈవెంట్ లో సినిమాలో నటించిన నటీ నటులు ,సాంకేతిక నిపుణులు పాల్గొని తమ అనుభవాలని మీడియాతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదేల మాట్లాడుతూ మోహన్‌బాబుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. మోహన్‌బాబు గురించి మొదట్లో తనకు వేరేలా చెప్పారని.. కానీ సెట్స్‌లో ఆయనను చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని అసలు విషయం చెప్పుకొచ్చాడు .
ఆయనను చూస్తుంటే LKG పిల్లాడిలా
“మోహన్‌బాబు సర్ గురించి నాకు హిట్లర్ అని చెప్పారు. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అనుకున్నాను. కానీ ప్రతిరోజూ సెట్స్‌లో ఆయనను చూస్తుంటే LKG పిల్లాడిలా అయిపోయారు” శ్రీకాంత్ ఓదెల సరదాగా చెప్పడంతో ఆడిటోరియం నవ్వులు పూయించింది.
మోహన్‌బాబుతో కలిసి పనిచేయడం తనకు చాలా స్పెషల్ మూమెంట్ అని ,ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విషయమని చెప్పాడు.“ది ప్యారడైజ్ సినిమాకు ఏ అవార్డు వస్తుందో నాకు తెలియదు. కానీ మోహన్‌బాబు సర్‌తో కలిసి పనిచేయడం మాత్రం నా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్” అని మనసులోని మాటని బయటపెట్టాడు.
జడల్ పాత్రలో నాని – శిఖంజా మాలిక్ గా మోహన్ బాబు
షూటింగ్ సమయంలో మోహన్‌బాబు చాలా సరదాగా ఉంటారని, అందరితో కలిసిపోతారని ఆయన చెప్పుకొచ్చారు .అంటే మోహన్‌బాబు గురించి బయట ఉన్న ఇమేజ్‌కు, సెట్స్‌లో ఆయన ఉండే విధానానికి చాలా తేడా ఉందని ఓదెల మాటలను బట్టి అర్థమవుతోంది. .ఇక ‘ది ప్యారడైజ్’ విషయానికి వస్తే.. జడల్ పాత్రలో నాని నటించగా అతడిని డీ కొట్టే శిఖంజా మాలిక్ గా మోహన్ బాబు నటించిన సంగతి తెల్సిందే.
మొత్తానికి మోహన్‌బాబుతో పనిచేసిన అనుభవాన్ని శ్రీకాంత్ చెబుతూ “హిట్లర్ అనుకున్నా.. కానీ LKG పిల్లాడిలా” అనే మాటలు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక మోహన్‌బాబు విషయానికి వస్తే. ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీ’, ‘పెదరాయుడు’ రాయలసీమ రామన్న చౌదరి అంటూ ఎన్నో సినిమాలతో తెలుగు నాట డైలాగ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు.
నెట్టింట్లో హైలెట్
అలా విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో రకాల పాత్రలు చేసిన ఆయన.. తన డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్నారు.అలాంటి సీనియర్ నటుడు మోహన్‌బాబు గురించి బయట వినిపించే ఇమేజ్‌కు, తాను షూటింగ్ సెట్స్‌లో చూసిన వ్యక్తికి చాలా తేడా ఉందని శ్రీకాంత్ ఓదెల చెప్పిన మాటలు ఇప్పుడు హైలెట్ గా నిలుస్తున్నాయి.
also read :కొబ్బరి మట్ట తర్వాత మోగని ఫోన్.. ప్యారడైజ్‌తో మళ్లీ మోగింది..సంపూర్ణేష్